బాబు సైలెంట్ వ్యూహం.. జగన్ భవిష్యత్తు అంధకారమేనా?

praveen
ఇటీవల కాలంలో పాలిటిక్స్ లో ప్రతీకార రాజకీయాలు ఎక్కువైపోయాయి. ఒకప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న అవి హుందాగానే ఉండేవి. కానీ ఇప్పుడు ఏకంగా వ్యక్తిగత విమర్శలు ఎక్కువైపోయాయి. ఇలా ప్రతీకార రాజకీయాల వైఫై నాయకులందరూ కూడా అడుగులు వేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు అటు ప్రతీకార రాజకీయాలు ఏపీలో పతాక స్థాయికి చేరుకున్నాయా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే అవును అనే సమాధానమే వినిపిస్తుంది. ఒకప్పుడు జగన్ సీఎం గా ఉన్నప్పుడు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి సీనియర్ రాజకీయ నాయకుడు టిడిపి అధినేత  చంద్రబాబును అరెస్టు చేయించారు.

 ఇక ఈ విషయం కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే జగన్ చెప్పిన విషయాన్ని తూచా తప్పకుండా పాటించిన పోలీసులు ఏకంగా చంద్రబాబు నాయుడు లాంటి బడానేతను అరెస్టు చేయడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే మళ్లీ టిడిపి అధికారంలోకి వస్తే మాత్రం ఏకంగా ప్రతీకార రాజకీయాలు పీక్ స్టేజ్ కు చేరుకుంటాయని ఏకంగా జగన్కు చంద్రబాబు చుక్కలు చూపిస్తారు అంటూ ఎంతో మంది అంచనా కూడా వేశారు. తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ లో గెలిచి  అధికారం చేపట్టిన వెంటనే తాము ప్రతీకార రాజకీయాలు చేయము అంటూ టిడిపి కూటమి చెప్పింది.

 కానీ ఇప్పుడు తనను జగన్ జైలుకు పంపిన విషయాన్ని గట్టిగా మనసులో పెట్టుకున్న చంద్రబాబు ఇక కామ్ గా ఉంటూనే గట్టిగా దెబ్బ కొడుతున్నాడు అన్నది ఇప్పుడు  రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. ఎందుకంటే జగన్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఒకప్పుడు జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును ఇబ్బంది పెట్టిన అధికార యంత్రంగాన్ని మొత్తం ముప్పు తిప్పలు పెడుతున్నారు చంద్రబాబు. ఏకంగా పాత విషయాలన్నింటినీ కూడా తెరమీదికి తీసుకువచ్చి కేసులు పెట్టేస్తూ ఉన్నారు. ఇలా ఒకరకంగా తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టిన నేతలను అధికారులను టార్గెట్ చేయడమే కాదు.. భవిష్యత్తులో జగన్ అధికారంలోకి వచ్చినా కూడా మళ్లీ జగన్ చెప్పినట్లుగా చేయాలి అంటే తర్వాత ఏం జరుగుతుందో అని భయం పుట్టెంతల ప్రస్తుతం చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. దీంతో చంద్రబాబు పన్నిన వ్యూహంతో అటు రానున్న రోజుల్లో జగన్ పార్టీలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలకు.. జగన్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును ఇబ్బంది పెట్టిన అధికారులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు అన్నది తెలుస్తోంది. ఏం జరగబోతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: