రూమర్స్ కు చెక్...అఖిల్-జైనబ్ వివాహంపై నాగార్జున మరో సంచలన ప్రకటన?

Veldandi Saikiran
అక్కినేని నాగార్జున కుటుంబంలో వరుసగా... శుభకార్యాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు అక్కినేని నాగచైతన్య ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత రెండో పెళ్లికి రెడీ అయ్యాడు అక్కినేని నాగచైతన్య. ఈ మేరకు ఆగస్టు 8వ తేదీన ఈ సంవత్సరం అక్కినేని నాగచైతన్య అలాగే శోభిత ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రకటన కూడా అక్కినేని నాగార్జున స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
 అయితే జనాలందరూ అక్కినేని నాగచైతన్య అలాగే శోభిత  వివాహం ఎప్పుడు జరుగుతుంది అని అనుకుంటున్న నేపథ్యంలోనే మరో ట్విస్ట్ ఇచ్చింది అక్కినేని కుటుంబం. అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అక్కినేని అఖిల్ వివాహాన్ని కూడా సెట్ చేసేశారు. ఈ మేరకు రహస్యంగా ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు అక్కినేని కుటుంబ సభ్యులు. హైదరాబాదులోని అక్కినేని ఇంట్లోనే... అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగింది.
 ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె జైనాబ్  తో అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా అక్కినేని నాగార్జునని మరోసారి సోషల్ మీడియాలో విడుదల చేశారు. అయితే అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ జరగగానే అందరికీ ఒక ప్రశ్న నెలకొంది. అక్కినేని నాగచైతన్య అలాగే అక్కినేని అఖిల్ ఇద్దరి వివాహం ఒకటే రోజు జరగబోతుందని... అది కూడా డిసెంబర్ 4వ తేదీ అని ప్రచారం జోరుగా సాగింది.
 ఈ వార్తలపై తాజాగా స్వయంగా అక్కినేని నాగార్జున స్పందించారు. అక్కినేని నాగచైతన్య అలాగే అఖిల్ వివాహాలు రెండు ఒకేరోజు జరగబోవు అని... డిసెంబర్ 4వ తేదీ అనేది తప్పు అని ఆయన ఖండించడం జరిగింది. వచ్చే సంవత్సరం అఖిల్ వివాహం జరగబోతుందని తెలిపాడు. అఖిల్ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నానని ప్రకటించాడు. అతనికి కాబోయే భారీ జైనాబు చాలా మంచి అమ్మాయిని తెలిపాడు. వాళ్ళిద్దరి వివాహం.. వచ్చే సంవత్సరం మంచి ముహూర్తం చూసి చేస్తామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: