తెలుగు సినీ పరిశ్రమ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. వారిలో కొంత మంది కి మాత్రమే అద్భుతమైన విజయాలను అందుకుంటూ అద్భుతమైన స్థాయికి చేరుకుంటూ ఉంటారు. ఇక మరి కొంతమందికి అందం , అభినయం , నటన అన్ని ఉన్నా కూడా అవకాశాలు పెద్దగా దక్కకపోవడంతో వారు ఇతర హీరోయిన్లతో పోలిస్తే వెనుకబడిపోతూ ఉంటారు. ఇకపోతే పైన ఫోటోలో ఓ చిన్న పాప ఉంది కదా ఆమెను గుర్తుపట్టారా .? ఆమె తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమానే ఓ మంచి క్రేజ్ ఉన్న హీరోతో నటించింది.
కానీ ఆ సినిమా పెద్ద విజయం సాధించలేదు. అయినప్పటికీ ఆ మూవీ ద్వారా నటికి మంచి గుర్తింపు లభించిన ఆ తర్వాత భారీ విజయాలు ఈమెకు దక్కకపోవడంతో ఈమె చాలా తక్కువ కాలంలోనే ఇండస్ట్రీకి దూరం అయింది. మరి ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా .? ఆమె మరెవరో కాదు ... మంజిమా మోహన్. ఈ ముద్దుగుమ్మ నాగ చైతన్య హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన సాహసం శ్వాసగా సాగిపో అనే సినిమాతో తెలుగు పరిచయం అయింది. ఈ మూవీ పెద్ద విజయం సాధించకపోయినా ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది.
ఆ తర్వాత ఈమె కథానాయకుడు , మహానాయకుడు అనే సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఈమె తెలుగులో ఏ సినిమాలో కూడా నటించలేదు. ఇక ఈమె కెరియర్ మంచి దశలో ముందుకు సాగుతున్న సమయంలోనే 2022 వ సంవత్సరం ప్రముఖ నటుడు కార్తీక్ కొడుకు అయినటువంటి గౌతమ్ కార్తీక్ ను వివాహం చేసుకుంది. వీరిద్దరిది ప్రేమ వివాహం. మంజుమా మోహన్ , కార్తీక్ కలిసి దేవరత్తం అనే సినిమాలో కలిసి నటించారు.