చచ్చినా.. హైప్ తీసుకొచ్చిన చిత్రం.. అవికా నటనకి హ్యాట్సాఫ్..!
•సాండ్ మూమెంటే సినిమాకి హైలెట్ గా నిలిచింది..
•హీరోయిన్ మరణించినా.. ప్రేక్షకులు మాత్రం ఆదరించారు..
•అవికా ఘోర్ నటనకి ఫ్యాన్స్ ఫిదా..
యంగ్ హీరో నిఖిల్ , హెబ్బా పటేల్, నందిత శ్వేత, వైవా హర్ష వంటి వారు కీలకమైన పాత్రలో నటించిన చిత్రం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'.. ఈ సినిమా నవంబర్ 11, 2016లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకి దర్శకత్వం డైరెక్టర్ వి. ఆనంద్ వ్యవహరించారు. ఈ సినిమా అప్పట్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమా కాస్త హర్రర్ ఫిలిం అని కూడా చెప్పవచ్చు. ఈ సినిమా మొత్తం ఆత్మ చుట్టూ తిరిగే కథ లా ఉంటుంది.
అర్జున్ పాత్రలో నిఖిల్ నటించగా.. ఆయేషా పాత్రలో అవికాగోర్ నటించింది. అయితే వీరిద్దరూ మొదట ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పటికీ.. అలా పెళ్లికి వస్తున్న సమయంలో ఆయేషా కనిపించకపోవడంతో అర్జున్ డీలా పడిపోతారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనే విషయం పైన ఆలోచించని అర్జున్.. ఆ తర్వాత తాను మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని గుర్తించిన తన స్నేహితుడు (వెన్నల కిషోర్ )వెంటనే కేరళకు చికిత్స కోసం తీసుకువెళ్తారు. ఇక అక్కడే అర్జున్ అమల (హెబ్బా పటేల్) ను చూసి ఆమె పైన ఆకర్షితుడవుతారు. అయితే ఈమె కూడా కొద్దిరోజులు అర్జున్ తో చనువుగా ఉండి అనుకోకుండా వెళ్ళిపోతుంది. దీంతో అర్జున్ మరొకసారి మనసు ముక్కలవుతుంది.
అయితే ఆమెను వెతుక్కుంటూ ఆమె ఇంటికి వెళ్లిన అర్జున్ కి అక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ ఎదురవుతుంది.. అదేమిటంటే తాను నాలుగేళ్ల క్రితం ప్రేమించిన ఆయేషా ప్రమాదంలో చనిపోయిందని, ఆమె ఆత్మ హెబ్బా పటేల్ లో ఆవహించి తనకు కేరళలో పరిచయమైన అమ్మాయిగా తిరుగుతోందని తెలుసుకుంటారు అర్జున్.. ఇందులో కీలకమైన పాత్రలు నందితా శ్వేతా కూడా నటించింది. ఇలా ఈ సినిమా మొత్తం ట్విస్టులతో నిండి ఉంటుంది. మొత్తానికి ఈ సినిమా టర్నింగ్ పాయింట్ కి అవికా గోర్ అని చెప్పవచ్చు. ఈమె నటించిన పాత్రే ఈ సినిమా మొత్తం నడిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా యూట్యూబ్లో ఉంది.. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ హర్రర్ సినిమా.. ఎవరైనా చూడని వారు ఉంటే చూడవచ్చు. మొదటిసారి చూసినప్పుడు ఈ సినిమా చూడడానికి చాలా ఎక్సైటింగ్ గా కనిపిస్తూ ఉంటుంది.. పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.