ఏంటి రజినీకాంత్ కి పిచ్చా.. ప్రతిరోజు రాత్రి టాబ్లెట్లు కూడా వేసుకుంటాడా ... ఇంతకీ నాగబాబు చెప్పిన మాటల్లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.నాగబాబు రీసెంట్ గా ఎన్ మీడియా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఓ ఇంటర్వ్యూలో రజినీకాంత్ గురించి ఎన్నో సంచలన విషయాలు బయట పెట్టారు.నాగబాబు మాట్లాడుతూ.. రజినీకాంత్ అంటే నాకు ఎంతో ఇష్టం.. అయితే ఆయన ఏజ్ మీద పడ్డాక గుళ్లు,గోపురాలు అంటూ తిరుగుతున్నారు. కానీ ఒకప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా అగ్రేసివ్ గా ఉండేవారు. ఆయన తన కోపాన్ని అస్సలు కంట్రోల్ చేసుకునే వారు కాదు.ఇక ఓ సమయంలో ఏదో విషయంలో మా అన్నయ్య చిరంజీవి గారితో కూడా గొడవ పెట్టుకున్నారు.వారిద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది.ఆ తర్వాత మళ్లీ అవన్నీ పక్కన పెట్టేసి ఇద్దరు కలిసి పోయారు.
ఇక ఓ సందర్భంలో రజినీకాంత్ గురించి ఒక జర్నలిస్టు నెగిటివ్ గా రాశారు.ఆ జర్నలిస్టు రాసిన దానికి ఎంతో కోప్పడిన రజినీకాంత్ వెంటనే ఆ జర్నలిస్ట్ దగ్గరికి వెళ్లికొట్టేశారు. ఇక పగబట్టిన జర్నలిస్టు మిగతా జర్నలిస్టులతో కలిసి రజినీకాంత్ పై వరుస కథనాలు వేశారు.రజినీకాంత్ కి పిచ్చి పట్టిందని ఆయనకు చాలా రోజుల నుండి ఈ పిచ్చి ఉంది అని ప్రతిరోజు ఆయన తన పిచ్చి తగ్గడం కోసం టాబ్లెట్లు కూడా వేసుకుంటారు అంటూ ఒకరి తర్వాత ఒకరు నెగిటివ్ వార్తలు రాసేలా చేశారు. అయితే ఒకరినైతే కొట్టగలిగారు. కానీ మిగిలిన వాళ్ళందరూ కక్షకట్టడంతో రజినీకాంత్ చాలా టార్చర్ అనుభవించాడు.
ఆ తర్వాత ఆ కోపాన్ని మెల్లిమెల్లిగా వదిలి ధ్యానం, యోగ వంటివి చేస్తూ తన కోపాన్ని వదిలేసి ఆధ్యాత్మిక చింతనలో బతుకుతున్నారు. రజినీకాంత్ అంటే నాకు చాలా ఇష్టం. నేను మా అన్నయ్య కూతురు పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకున్నాను. అంతేకాదు ఇప్పటికీ రజినీకాంత్ కి మా మెగా కుటుంబానికి ఎంతో మంచి అనుబంధం ఉంది అంటూ మెగా బ్రదర్ నాగబాబు రజనీకాంత్ గురించి షాకింగ్ విషయాలు చెప్పారు. అయితే రజినీకాంత్ నాగబాబు చెప్పినట్లు ఇప్పుడైతే చాలా కూల్ గా కనిపిస్తారు. కానీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా అగ్రేసివ్ గా ఉండేవారట.ముఖ్యంగా ఈయనతో సినిమా చేసే దర్శకులు చాలా భయపడిపోయేవారట.