ఆవిడా మా ఆవిడే: ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు..!!

Pandrala Sravanthi
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున హీరో అంటే చాలామంది హీరోయిన్ లు ఆయన సినిమాల్లో చేయడానికి ఎగబడుతూ ఉంటారు. అలా అప్పటి జనరేషన్ నుండి ఇప్పటి జనరేషన్ వరకు ఎంతో మంది హీరోయిన్ లతో నాగార్జున స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా ఈయనతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ హీరోయిన్లు కూడా క్యూ కట్టేవారట అంటే నాగార్జున తన అందంతో అంతలా ఆకట్టుకున్నారు. అయితే అలాంటి నాగర్జున హీరోగా చేసిన ఆవిడా మా ఆవిడే సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో నాగార్జున ఇద్దరు భార్యలను మేనేజ్ చేయలేక పడ్డ తంటాలు చాలామందికి నవ్వులు తెప్పిస్తాయి. ఇక కథలోకి వెళ్తే.. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో జయభేరి ఆర్ట్స్ ప్రొడక్షన్ పై డి కిషోర్ నిర్మాతగా చేసిన ఆవిడా మా ఆవిడే సినిమా లో హీరోగా నాగార్జున విక్రాంత్ పాత్రలో నటించారు. అలాగే ఈ సినిమాలో టబు హీరా రాజగోపాల్ ఇద్దరు హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమాలో విక్రంత్ టబు లు పోలీస్ ఆఫీసర్లుగా కనిపిస్తారు.

అయితే పెళ్లంటే ఇష్టం లేని టబు సీఐ గా చేసిన విక్రాంత్ ని చూసి ఇష్టపడి పెళ్లికి ఒప్పుకుంటుంది. వీరిద్దరికి పెళ్లి జరిగాక ఓ అబ్బాయి పుడతాడు. అయితే ఓ రోజు ప్రమాదంలో నాగార్జున భార్యాపాత్రలో చేసిన టబు ఆయన కొడుకు ఇద్దరు మరణిస్తారు.ఇక కొడుకు భార్య మరణం నుండి బయటపడలేక నాగార్జున బాధపడుతూ ఉంటాడు. ఇక నాగార్జున బాధ చూడలేక ఇంట్లో వాళ్ళు మళ్లీ ఝాన్సీ అనే అమ్మాయిని అంటే హీరా రాజగోపాల్ అనే హీరోయిన్ ఇచ్చి పెళ్లి చేస్తారు. కానీ నాగార్జున తన గతాన్ని రెండో భార్యకు కుటుంబ సభ్యులు చెప్పనివ్వరు. ఇక ట్విస్ట్ ఏంటంటే.. చనిపోయారు అనుకున్నా నాగార్జున మొదటి భార్య టబు అలాగే కొడుకు ఇద్దరు తిరిగి వస్తారు. మేం చనిపోలేదు మమ్మల్ని తీవ్రవాదులు ఎత్తుకెళ్లారని చెబుతారు. ఇక ఇక్కడే అసలు కథ మొదలవుతుంది.

ఎందుకంటే అటు మొదటి భార్యకు రెండో పెళ్లి చేసుకున్న విషయం చెప్పలేక రెండో భార్యకి మొదట పెళ్లయింది అనే విషయం చెప్పలేక నాగార్జున పడే తంటాలు అన్ని ఇన్నీ కావు.అంతేకాదు ఇద్దరు భార్యలు కలిసి ఒకే అపార్ట్మెంట్లో కాపురం కూడా పెడతారు. అలా ఆ ఇంట్లో నుండి ఈ ఇంట్లోకి ఈ ఇంట్లో నుండి ఆ ఇంట్లోకి నాగార్జున మారుతూ ఉంటారు. ఆ సమయంలో సినిమా చూసే ప్రేక్షకులకు నవ్వులు రాక తప్పదు. ఇక చివరికి నాగార్జున ఫుల్లుగా తాగి వచ్చి టబూ నా మొదటి భార్య అని ఆమె చనిపోయిందని తెలిసి నిన్ను పెళ్లాడానని రెండో భార్యకు అసలు విషయం చెబుతాడు.దాంతో కథ ఎండ్ అవుతుంది. అలా ఇద్దరు భార్యల మధ్య నలిగిపోయిన భర్త పాత్రలో నాగార్జున చాలా ఆకట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: