సంక్రాంతికి ఎన్నో సినిమాలున్నా నో మ్యాటర్.. ఆ రెండు సినిమాలకే మాక్సిమం థియేటర్స్..?

MADDIBOINA AJAY KUMAR
వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద వార్ జరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకు అంటే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు నుండే ఏకంగా నాలుగు సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక తమిళ్ నుండి ఒక డబ్బింగ్ సినిమా కూడా తెలుగు లో విడుదల కాబోతుంది. ఇక మొదట వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమా జనవరి 10 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఆ తర్వాత రెండు రోజులకు జనవరి 12 వ తేదీన బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ సినిమా విడుదల కానుంది.

ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఆ తర్వాత జనవరి 14 వ తేదీన విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాను విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని కూడా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇక సందీప్ కిషన్ హీరోగా త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న మజాకా సినిమా జనవరి 14 న లేదా 15 వ తేదీల్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లతో పాటు తమిళ నటుడు అజిత్ హీరోగా రూపొందుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో జనవరి 10 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు. ఇలా వచ్చే సంవత్సరం సంక్రాంతికి చాలా సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నా గేమ్ చేంజర్ సినిమాకు దాదాపు 50 శాతం థియేటర్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు , ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు కూడా మంచి స్థాయిలో థియేటర్లను కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఆ తర్వాత ఏ సినిమాకు మంచి టాక్ వస్తే ఆ సినిమా థియేటర్లను పెంచనున్నట్లు , టాక్ బాగా రాని సినిమా థియేటర్లను తగ్గించే విధంగా సినిమా నిర్మాతలు , డిస్ట్రిబ్యూటర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: