ఆ టాలీవుడ్ కుర్రాడితో నటి ప్రగతి ఆంటీ ఎఫైర్ ?
సోషల్ మీడియాలో తాను పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతంగా లైక్స్ వస్తాయి. ఈ మధ్యకాలంలో నటి ప్రగతి సినిమాలు చేయడం కాస్త తగ్గించిందని చెప్పాలి. దానికి గల కారణం ప్రగతి పవర్ లిఫ్టింగ్ లోను తన సత్తాను చాటుతోంది. యువతకు చాలెంజ్ విసురుతూ పవర్ లిఫ్టింగ్ ఛాలెంజ్ లో ట్రోఫీలు సైతం గెలుచుకుంటుంది. ముఖ్యంగా గత సంవత్సరం బెంగుళూరులో 28వ బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో ప్రగతి ప్రొఫెషనల్స్ పోటీపడి మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది.
ప్రొఫెషనల్ లైఫ్ పరంగా సక్సెస్ అయినప్పటికీ పర్సనల్ లైఫ్ లో మాత్రం ప్రగతికి అన్ని ఎదురు దెబ్బలే తగిలాయి. చిన్న వయసులోనే వివాహం చేసుకున్న ప్రగతి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత తన భర్త నుంచి అభిప్రాయ భేదాలు రావడం గొడవలు రావడంతో ఇద్దరూ విడాకులు తీసుకొని వేరుగా ఉన్నారు. అప్పటి నుంచి ప్రగతి తన పిల్లల బాధ్యతలను సింగిల్ మదర్ గా చూసుకుంటుంది.
సింగిల్ మదర్ గా ఎన్నో కష్టాలు పడుతూ కొడుకు కూతురును పెంచి పోషించింది. కాగా, ఈ మధ్య నటి ప్రగతికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రగతి ఆంటీ ఓ టాలీవుడ్ యంగ్ కుర్రాడుతో ఎఫైర్ పెట్టుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ రూమర్ వైరల్ అవుతుంది. ఇక ఈ వార్తలో ఏ మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.