అన్నపూర్ణమ్మ చనిపోయినప్పుడు కాదు.. ఆ టైంలో ఏఎన్ఆర్ ఎంతో ఏడ్చారట తెలుసా?
సాధారణంగా స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారు వారి వారసులను ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయం చేయాలని చూస్తూ ఉంటారు. కానీ ఏఎన్ఆర్ మాత్రం ఎప్పుడు అలా అనుకోలేదట. తన కొడుకులు ఇద్దరిని ఎప్పుడూ కూడా సినిమాలు చేయాలని కోరలేదట. కాగా నాగార్జున మెకానికల్ ఇంజనీరింగ్ చేసేందుకు ఫారిన్ వెళ్ళాడట. బిజినెస్ లేదంటే జాబ్ చేయాలనే ఉద్దేశమే ఆయనకు ఉండేదట. ఇక చదువు పూర్తి చేసుకుని ఇండియాకి వచ్చాక తర్వాత ఏం చేయాలి అనే విషయంపై డైలమాలో పడిపోయాడట నాగార్జున.
అదే సమయంలో ఏఎన్నార్ సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు. ఇక నాగార్జున అన్నయ్య వెంకట్ సినిమా ప్రొడక్షన్స్ పనులు చూసుకునేవారు. నాగార్జున కూడా ఖాళీగా ఉండడంతో ఈ ప్రొడక్షన్ పనుల్లో ఇన్వాల్వ్ అయ్యారట. ఇక ఇలా జరుగుతున్న సమయంలో అనుకోకుండా ఓ రోజు నాగార్జున అన్నయ్య వెంకట్ తన మనసులో మాట బయటపెట్టాడట. నాగార్జున నువ్వు సినిమాలు చేస్తావా అని అడిగాడట.
అప్పుడే నేను సినిమాలు చేయగలనా.. నాన్నగారిలా ప్రేక్షకులను మెప్పించగలనా అనే భయం నాగార్జునలో పట్టుకుందట. కానీ భయం భయంగానే ఓకే చెప్పేసాడట. ఇదే విషయం తండ్రి ఏఎన్ఆర్ కు చెబితే ఆయన ఒక్కసారిగా ఏడ్చేసారట. అన్నపూర్ణమ్మ చనిపోయినప్పుడు ఏడ్చిన ఏఎన్నార్ మళ్లీ నాగార్జున ఆ మాట చెప్పడంతోనే కన్నీళ్లు పెట్టుకున్నారట. కొడుకులకు చెప్పకపోయినా తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే వారు లేరు అనే బాధ ఏఎన్ఆర్ లో ఉండిపోయిందట. అందుకే నాగర్జున హీరో అవుతాను అని చెప్పగానే ఇక ఒక్కసారిగా కన్నీళ్లు వచ్చేసాయట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో నాగార్జున చెప్పారు. ఇక ఆ తర్వాత నాగార్జున ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇవ్వడం.. అంచలంచలుగా ఎదిగిన తీరు అందరికీ తెలిసిందే.