నయనతార పెద్ద జాదూ.. విగ్నేష్ అమాయకుడు.. బయటపడ్డ నయన్ బండారం.?

Pandrala Sravanthi
సినిమా ఇండస్ట్రీలో పనిచేసే చాలా మంది నటీనటులు  ఇండస్ట్రీలోని వారితోనే ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకుంటారు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లను, నిర్మాతలను, హీరోలను కమెడియన్లను ఇతర నటీనటులను పెళ్లి చేసుకున్న దాఖలాలు అనేకం ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది  స్టార్ హీరోయిన్ నయనతార. స్టార్ డైరెక్టర్ అయినటువంటి విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకుంది. అలాంటి నయనతార విగ్నేష్ మధ్య ప్రేమ ఎలా పుట్టింది. ఎవరు ముందు ప్రపోజ్ చేశారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. సౌత్ ఇండియన్ లేడీస్ సూపర్ స్టార్ గా పేరు పొందింది నయనతార. అయితే ఈమె విగ్నేష్ శివన్  డైరెక్షన్ లో నానుమ్ రౌడీధాన్  అనే మూవీలో నటించింది. ఇందులో విజయ్ సేతుపతి హీరో.  

2015లో వచ్చినటువంటి ఈ మూవీ ద్వారా విగ్నేష్ కి ఎంతో పేరు వచ్చింది. ఈ మూవీ షూటింగ్ పాండిచ్చేరిలో మొదలుపెట్టారట. రోడ్లపై కొన్ని సీన్లు షూట్ చేస్తున్న సమయంలో విజయ్ కి విగ్నేష్ ఒక షాట్ గురించి వివరిస్తున్నాడు. నేను అనుకోకుండానే విగ్నేష్ వైపు అలా చూశాను. ఆ టైంలో ఆయన చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు. అలా మళ్లీ మళ్లీ అతన్నే చూశాను. కానీ విగ్నేష్ నన్ను పట్టించుకోలేదు. కానీ ఈసారి ఇంకా క్రేజీగా ఆయన వంక అలాగే చూశాను. కానీ నన్ను పట్టించుకోకుండా తన డైరెక్షన్ పై దృష్టి పెట్టి  తన పని తాను చేసుకుంటూ వెళ్లడం నాకు ఎంతో నచ్చాయి. ఆ క్షణమే అతనితో లవ్ లో పడ్డానేమో  అని చెప్పుకొచ్చింది.

అలా ముందుగా నేనే విగ్నేష్ దగ్గరికి వెళ్లి ప్రపోజ్ చేశాను.  ఓ రోజు సినిమా గురించి మాట్లాడుతూ ఉంటే సినిమా గురించి పక్కన పెట్టు మనిద్దరం ప్రైవేట్ విషయాలు మాట్లాడుకుందాం అంటూ హింట్ ఇచ్చాను. అలా ఇద్దరి మధ్య కాస్త చనువు పెరిగి  ప్రేమకు దారి తీసి చివరికి పెళ్లి వరకు తీసుకెళ్లింది. 2022లో ఇద్దరం వివాహం ద్వారా ఒకటయ్యామని తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చామని నయనతార చెప్పుకొచ్చింది. ఆమె ఈ విషయాన్ని బయట పెట్టడంతో నయనతార మామూలుది కాదు అంటూ  సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: