ఒకప్పుడు పండ్లు అమ్మారు.. కానీ ఇప్పుడు రూ. 10వేల కోట్ల ఆస్తి?

praveen
ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుంది అని ఊహించడం చాలా కష్టం. అప్పటివరకు ఏకంగా పేదరికంలో గడిపిన వారు..  ఆ తర్వాత పట్టుదలతో శ్రమించి ఏదో ఒక రంగంలో ఎదిగి కోటీశ్వరులుగా మారిన వారు ఇటీవల కాలంలో చాలా మంది కనిపిస్తున్నారు. పట్టుదలతో అనుకున్న లక్ష్యం వైపు ముందుకు వెళితే సాధించలేనిది ఏదీ లేదు అని నిరూపించి.. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న వారు కూడా ఉన్నారు అని చెప్పాలి.

 ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి వారి గురించే. ఏకంగా వారికి ఇప్పుడు పదివేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఏకంగా ఇండియాలోనే అత్యంత ధనవంతులైన ప్రొడ్యూసర్లుగా కొనసాగుతున్నారు. ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ ఇక ప్రేక్షకులను అలరిస్తూనే భారీగా సంపాదిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక నిర్మాణ సంస్థ ఏదైనా సినిమాను నిర్మిస్తుంది అంటే చాలు ఇక అందులో ఏదో కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు నమ్మెంతల అందరి హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. వాళ్ళు ఎవరో కాదు టి - సిరీస్ అధినేతలు.

 ఇలా ఇప్పుడు ఏకంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ కుటుంబం.. ఒకప్పుడు పండ్లు అమ్ముతూ జీవనం సాగించిందట. ఒకప్పుడు ఇలా పండ్లు అమ్ముతూ భూషణ్ కుటుంబం జీవనం సాగించగా.. ఆ తర్వాత భూషణ్ తండ్రి గుల్షన్ కుమార్ 1970 లలో ఏకంగా సంగీత క్యాసెట్లు విక్రయించే షాపు కొనడంతో వీరి రాత మారిందట. ఇక హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 ప్రకారం 10000 కోట్ల నికర విలువతో టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ధనవంతులుగా అగ్రస్థానంలో ఉన్నారు. గతంలో కపూర్, చోప్రాలకే ఈ ట్యాగ్ ఉండేది. ఇక ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేశారు భూషణ్ కుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: