వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం లేదా.. అనవసరంగా పెద్ద సీన్..?

Pulgam Srinivas
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరో అలాగే ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఓ యువ నటి పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక ఆ వార్త ఏమిటి ..? అసలు అందులో నిజం ఉందా ..? లేదా అనే వివరాలను తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీ;లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో సుశాంత్ ఒకరు. ఈయన కాళిదాసు అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యి ఆ తర్వాత పలు సినిమాలలో హీరోగా , కొన్ని సినిమాలలో కీలక పాత్రలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన కొంత కాలం క్రితం ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటీమణి మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. ఈ మూవీతోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరకు పరిచయం అయింది. ఇక ఇచట వాహనములు నిలపరాదు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈమెకు ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు వచ్చాయి. దానితో ప్రస్తుతం ఈ బ్యూటీ ఫుల్ బిజీ నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది. 

ఇది ఇలా ఉంటే సుశాంత్ , మీనాక్షి చౌదరి ప్రేమించుకున్నారు అని , వారిద్దరూ తమ ప్రేమ గురించి తమ ఇంట్లో పెద్దలకు చెప్పి పెళ్లికి ఒప్పించారు అని , త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారు అని గత కొన్ని రోజులుగా ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే దీనిని చాలా మంది నిజం అనే నమ్మారు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వీరి పెళ్లిపై వస్తున్న వార్తలు అన్నీ పూర్తిగా అవాస్తవం అని , వీరి మధ్య ఎలాంటి ప్రేమ లేదని , వీరు పెళ్లి కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: