"ఒక్కొక్కడికి తాట తీసేస్తా".. బాలయ్య కి కోపం తెప్పించిన స్టార్ హీరో..ఏమైందంటే..?
రకరకాల చిలిపి ప్రశ్నలు అడగడంతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని విషయాలను కూడా అడిగి తెలుసుకున్నారు . ఇదే మూమెంట్లో చాలామంది పవన్ కళ్యాణ్ తో ఉన్న గొడవ గురించి బాలయ్య ప్రశ్నించాలి కదా ..? అంటూ ట్రోల్ చేశారు . బాలయ్య కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని బాలయ్య కూడా మెగా ఫాన్స్ ట్రోలింగ్ దెబ్బకు భయపడ్డాడు అని చాలామంది ఆయనను వెటకారంగా వ్యంగంగా కామెంట్ చేశారు . దీనితో సోషల్ మీడియాలో నందమూరి ఫ్యాన్స్ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది.
మీరు మీరు కొట్టుకోండి మధ్యలో మా బాలయ్యను ఎందుకు లాగుతారు ..? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . అంతేకాదు బాలయ్యకు కోపం వస్తే ఒక్కొక్కరికి తాటి తీసేస్తారు అంటూ ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు. బాలయ్య కి పరోక్షకంగా పుష్ప రాజ్ కోపం తెప్పించినట్లైంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. కాగా బాలయ్య ఒకపక్క రాజకీయాలలో బిజీగా ఉంటూనే మరొక పక్కా అన్ స్టాపబుల్ షో ని చేస్తున్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా షూట్ ని ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసేసినట్లే తెలుస్తుంది.
అంతేకాదు ఆ తర్వాత ఆయన కమిట్ అయిన సినిమాలను కూడా త్వరగా ఫినిష్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట . అంతేకాదు సోషల్ మీడియాలో ఒక వార్త కూడా బాగా ట్రెండ్ అవుతుంది. మోక్షజ్ఞ కోసం స్వీట్ సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశాడట బాలయ్య. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఎప్పటినుంచో వర్క్ చేస్తున్నారట బాలయ్య - ప్రశాంత్ వర్మ -మోక్షజ్ఞ . త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన కీలక అప్డేట్స్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారట..!