మొత్తానికి సమంత నటించిన సిటాడెల్ హిట్టా.. ఫట్టా..?
అయితే ఇలా జరగడానికి ముఖ్య కారణం డైరెక్టర్ రాజ్ అండ్ డీకేలే అన్నట్లుగా సమాచారం.. తీసుకున్న కథను డ్యూయల్ లేయర్ ఫార్మాట్లో ప్రతి ఎపిసోడ్ ని కూడా ఫ్లాష్ బ్యాక్ అంటూ రెండు భాగాలుగా విభజించి చెప్పడం ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ కాలేదట.. స్ట్రైట్ నెరవేషన్లో ముందుకు సాగే సమంత, వరుణ్ ల పరిచయం ఆ తర్వాత ప్రేమతో మొదలుపెట్టి విడిపోవడానికి కారణాన్ని చూపించడంతోపాటు శత్రువులు వెంటపడే సన్నివేశాలను కొంత ఎక్కువగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది అన్నట్లుగా నేటిజన్స్ అభిప్రాయంగా తెలుపుతున్నారట. కానీ సిటాడెల్ లో మాత్రం అలాంటి డెప్త్ లేదని తెలియజేస్తున్నారు.
ఇందులో కొన్ని ఫైట్ సీన్లు తప్పించి మరొకసారి చూద్దామని పెంచేలా ఆడియన్స్ ని ఆకట్టుకోలేదట.. టాక్ బాగా వస్తేనే జనాలు చూసేది మొదలు పెడతారు.. అమెజాన్ ప్రైమ్ కేవలం ప్రమోషన్స్ కోసమే కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టింది. ఇక రెమ్యూనరేషన్ బడ్జెట్లు కూడా భారీగానే పెరిగిపోయిందట.. ఇదంతా కూడా డైరెక్టర్ రాజు అండ్ నీకే మీద నమ్మకంతోనే రిస్క్ చేసిన.. అందుకు తగ్గట్టుగా రిపోర్ట్స్ కూడా రాకపోవడంతో ఇది దెబ్బ పడిందని తెలియజేస్తున్నారు.. మొత్తానికి ఫలితం ఎలా ఉన్నప్పటికీ సమంత తన యాక్షన్లతో స్టంట్ లతో నటనతో మంచి పేరు అయితే సంపాదించుకున్నది.. అది కూడా హీరోని సైడ్ చేసి మరి సంపాదించుతుంది సమంత.