తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి టాప్ ఫ్యామిలీలలో మెగా, అల్లు ఫ్యామిలి ముందు వరుసలో ఉంటుంది. ఇందులో మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలో స్టార్లుగా ఎదిగారు. ఇక అల్లు ఫ్యామిలీ నుంచి సినిమా ఇండస్ట్రీలో వివిధ రంగాల్లో ఉన్నారు కానీ హీరోలుగా అల్లు అర్జున్ మాత్రమే స్టార్ అయ్యారు. ఈ రెండు ఫ్యామిలీలు బంధుత్వం పరంగా ఎంతో దగ్గరైనా కానీ అప్పుడప్పుడు ఈ కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు మనేంత వివాదాలు తలెత్తుతాయి. ఇందులో ముఖ్యంగా అల్లు అర్జున్ మరియు మెగా ఫ్యామిలీకి మధ్య అప్పుడప్పుడు క్రషెస్ వస్తూ ఉంటాయి. ఇదే తరుణంలో సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీలు మాట్లాడినటువంటి కొన్ని మాటలు మరోసారి వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
గత కొద్ది కాలంగా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య స్వల్పంగా విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సభల్లో అల్లు అర్జున్ ను పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం చెప్పమని అడిగితే నేను చెప్పలేనని ఆయన డైరెక్ట్ గా అంటుంటారు. అంతేకాదు ఆయన మెగా అనే ట్యాగ్ కు చాలా దూరంగా ఉంటారు. అలా మెగా ఫ్యామిలీతో సంబంధం లేకుండా అల్లు అర్జున్ తనకు తాను ఎదుగుతూ వస్తున్నారు. అయితే ఇదే తరుణంలో ఈ మధ్యకాలంలో ఏపీ రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల నుంచి పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు తెలియజేయడంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో అల్లుఅర్జున్ తీరుపై మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది పరోక్షంగా స్పందించి అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే తాజాగా ఒక సినిమా ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ నాకు ఫ్యాన్స్ ఎవరూ లేరు నా ఫ్యాన్స్ అంతా నా ఆర్మీ అంటూ నాకు నచ్చితే ఎక్కడికైనా వెలతా ఎవరినైనా కలుస్తా నా విషయంలో ఇంకొకరికి అవసరం లేదు అన్నట్టు మాట్లాడారు. ఈ విషయంపై తాజాగా మట్కా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ నేను మా బాబాయ్, పెదనాన్న గురించి ఎప్పుడో ఒక దగ్గర మాట్లాడుతూనే ఉంటాను. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం ఎలా వచ్చామనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి. అలా నువ్వు ఎదిగిన దాన్ని గుర్తుంచుకోకపోతే నువ్వు ఎంత సక్సెస్ అయినా దానికి విలువ ఉండదని కామెంట్ చేశాడు. ఈ వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకున్న చిరంజీవి తాజాగా బోలాశంకర్ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ ఎవరికి వారు సొంతంగా ఎదిగాలి మా తాతలు, మా నాన్నలు అంటూ చెప్పుకుంటూ ఎదిగితే దానికి వాల్యూ ఉండదు అంటూ చెప్పుకొచ్చారు. మెగా అనే ఇమేజ్ వాడకుండా ఎవరు ఎదిగిన అందులో నాకు ముందుగా ఆనందం ఉంటుంది. ఎవరైనా సరే సొంతంగా ఎదిగితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని చిరంజీవి అన్నారు. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.