చంద్రముఖి మూవీలో ఈ సిద్ధాంతి గుర్తున్నాడా ? ఆయన భార్య కూడా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నే..!

Amruth kumar
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో చంద్రముఖి కూడా ఒకటి .. 2005లో ప్రేక్షకులు\ ముందుకు వచ్చిన ఈ సినిమాలో జ్యోతిక , నయనతార , ప్రభు , వినీత్ , మాళవిక , వడివేలు , నాజర్ , సోనూసూద్ వంటి వారు ముఖ్య పాత్రలో నటించారు. పి వాసు తెర్కక్కించిన ఈ హారర్ మూవీ అప్పట్లోనే సుమారు 60 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటికీ కూడా ఈ సినిమా టీవీలో వస్తుందంటే చాలా మంది టీవీలకి అతుక్కుపోయి మరి చూస్తుంటారు. చంద్రముఖి సినిమాలో ప్ర‌తి క్యారెక్టర్ కు ఎంతో ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. అయితే ఈ సినిమాలో రజనీకాంత్ కు సహాయపడే రామచంద్ర సిద్ధాంతి పాత్ర కూడా ఒకటి.. ఈ సినిమా మొదటి భాగంలో ఆ పాత్ర అంతగా కనిపించకపోయిన సెకండ్ హాఫ్ లో సిద్ధాంతి పాత్ర ఎంతో హైలెట్ గా ఉంటుంది ..

అలా సిద్ధాంతి పాత్రలో జీవించిన నటుడి పేరు అవినాష్ .. కర్ణాటక కు  చెందిన ఈయన ఎక్కువ కన్నడ , తమిళ సినిమాల్లో నటించి స్టార్ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే చంద్రముఖి తో పాటు ఈయన తెలుగులో గోల్మాల్ , లక్ష్మీ కళ్యాణం , నాగవల్లి , ఒక్కడు , దరువు , డమరుకం , రోగ్ , రాజు గారి గది 2 వంటి సినిమాల్లో కీలకపాత్రలో కనిపిస్తారు. అయితే అవినాష్ భార్య కూడా సౌత్ చిత్ర పరిశ్రమలో స్టార్ నటినే .. కన్నడ , తమిళ సినిమాల్లో ఈమె ఎక్కువగా నటించారు .. అలా వచ్చిన డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు. ఇంతకీ ఆమె మరి ఎవరో కాదు కే జి ఎఫ్ సినిమాలో ఎంతో పవర్ఫుల్ రోల్ లో కనిపించిన మాళవిక .. ఈ సినిమాలో మీడియా రిపోర్టర్గా 24న్యూస్ చీఫ్ ఎడిటర్ గా మాళవిక అవినాష్ ముఖ్య పాత్రలో నటించారు.

అయితే తెలుగులో ఈమెమీ అసలు ఎలాంటి సినిమాలు చేయలేదు కానీ తమిళం , కన్నడలో మాత్రం స్టార్ న‌టిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమె ఒక సినిమాల్లోనే కాకుండా మాళవిక రాజకీయాల్లో కూడా ఎంతో చురుగ్గా ఉంటారు. కర్ణాటకలో బిజెపి అధికార ప్రతినిధిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తుంది ఈ సీనియర్ నటి. కేవలం ఒక సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై సీరియల్స్ లో కూడా మాళవిక నటించారు. తెలుగులో ఎంతో ఫేమస్ అయిన బతుకుజట్కబండి ప్రోగ్రాంకు కన్నడలో ఈమె హోస్ట్ గా  వ్యవహరించింది .. ప్రస్తుతం స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సౌత్ ఇండియాలోనే వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా కొనసాగుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: