ప్రభాస్ క్రేజ్‌ మాములుగా లేదుగా..రూ.650 కోట్ల రెమ్యూనరేషన్‌?

Veldandi Saikiran
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ అంతా ఇంతా కాదు. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. బాహుబలి సినిమా అనంతరం ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా చిత్రాలే కావడం విశేషం. 2002 సంవత్సరంలో ఈశ్వర్ సినిమాతో తెలుగు సినీ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ప్రభాస్. అనంతరం వర్షం, చత్రపతి సినిమాలతో మంచి స్టార్ స్టేటస్ అందుకున్నాడు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలలో ప్రభాస్ ఒకరు. ఇటీవలే ప్రభాస్ సలార్, కల్కి సినిమాలతో మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లు సమాచారం అందుతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే సలార్ 2 సినిమా షూటింగ్లో పాల్గొననున్నారు ప్రభాస్.

కాగా, ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంభలే సంస్థ ప్రభాస్ తో మూడు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ మూడు సినిమాలను 2026, 2027, 2028 సంవత్సరాలలో రిలీజ్ చేస్తామని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు  హోంభలే సంస్థ. ఈ ఒప్పందానికి గాను ప్రభాస్ రూ. 650 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సినీ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది.

సలార్ 2, లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ వర్మలతో కలిసి తీసే సినిమాలకు గాను ఈ డీల్ ఓకే చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వరుసగా ప్రభాస్ సినిమాలు రిలీజ్ అవుతాయని తెలిసి అతని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే... ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంభలే సంస్థ ప్రభాస్ తో మూడు సినిమాలకు  రూ. 650 కోట్ల రెమ్యూనరేషన్ వస్తున్నాయన్న వార్తలు ఇప్పుడు బాగా వైరల్‌ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: