డ్యాన్స్‌ లో కింగ్‌..కానీ ఆ విషయంలోనే ఎన్టీఆర్‌ వీక్‌ ?

Veldandi Saikiran
నందమూరి కుటుంబం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వీరి కుటుంబం నుంచి మూడో తరం హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చాడు. అతి చిన్న వయసులోనే సినిమాల్లోకి హీరోగా పరిచయమయ్యాడు. నిన్ను చూడాలని సినిమాతో హీరోగా పరిచయమైన ఎన్టీఆర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంతరం స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, సింహాద్రి వంటి సినిమాలలో నటించి మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

అయితే ఆ సక్సెస్ ఎక్కువ కాలం కొనసాగలేదు. ఎన్టీఆర్ నటించిన సినిమాలు ఫ్లాపులుగా మారాయి. అయినప్పటికీ ఎన్టీఆర్ హిట్లు, ఫ్లాపులు అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయాడు. ఆ సమయంలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యమదొంగ సినిమాలో నటించి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక తాజాగా ఎన్టీఆర్ దేవర సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించిన సంగతి విధితమే.

ఈ సినిమాలో జాన్వి నటనకు గాను మరిన్ని సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఇక ఈ బ్యూటీకి మరిన్ని సినిమా అవకాశాలు వస్తున్నాయని టాలీవుడ్ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. కాగా, ఎన్టీఆర్ అద్భుతమైన నటన, డ్యాన్సు, ఫైట్స్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. కానీ ఎన్టీఆర్ కి ఓ పెద్ద బలహీనత ఉందని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి సీన్లలోనైనా అవలీలగా నటిస్తాడు.

కానీ రొమాంటిక్ సన్నివేశాలలో నటించడం తనకు అస్సలు సూట్ కాదని ఎన్టీఆర్ చెప్పారు. అంతేకాకుండా రొమాంటిక్ సీన్లలో నటించడం అంటే తనకు కాస్త భయంగా ఉంటుందని చెప్పాడు. అలాంటి సీన్లను సరిగ్గా చేయలేనంటూ పలు సందర్భాలలో వెల్లడించాడు. అందుకే ఎన్టీఆర్ సినిమాలలో ఎక్కువగా రొమాంటిక్ సన్నివేశాలు ఉండవు. ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: