ఉదయ్ కిరణ్ , సుష్మితతో ఎంగేజ్మెంట్ కి ముందు ఎవరినీ లవ్ చేశాడంటే.. చిరు చేరదీయడం వెనక అంత స్టోరీ ఉందా..!

Amruth kumar
టాలీవుడ్ దివంగత యంగ్ హీరో ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు.. ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయాడు ఉదయ్ . బ్యాక్ టు బ్యాక్ లవ్ స్టోరీస్ సినిమాలతో విజయాలను అందుకున్నాడు. హ్యాట్రిక్ విజయాలతో అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా మారిపోయాడు. దాంతో అప్పుట్లో టాలీవుడ్ లో అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అందంగా కనిపించడం, ఇన్నోసెంట్‌గా ఉంటూ బాగా నటించడంతో అమ్మాయిలు ఆయన్ని బాగా ఇష్టపడేవారు. అంతేకాకుండా యూత్లో మంచి క్రేజ్ కూడా తెచ్చుకున్నారు.  అలాగే ఉదయ్ కిరణ్ తన కెరియర్ పరంగా చేసిన కొన్ని తప్పులు ఆయన నిజ జీవితంలో చేసిన కొన్ని పొరపాట్లు కొన్ని నిర్ణయాలు అయిన జీవితాన్ని మార్చేశాయి. అలా చివరికి ఆత్మహత్య చేసుకుని చనిపోయే పరిస్థితి దాప‌రించింది. అయితే ఉదయ్ కిరణ్ కెరియర్ డౌన్ అవటానికి మెగాస్టార్ చిరంజీవి కూడా కారణమని ఇప్పటికీ ఆయన అభిమానులు అంటూ ఉంటారు. అయితే నిజానికి ఉదయ్ కిరణ్ నీ అయ‌నే చేరదీశారనేది నిజం.

ఇక వరస విజయాలతో దూసుకుపోతున్న ఉదయ్‌కు ఆయన సపోర్టుగా నిలిచాడు.. అంతేకాకుండా కూతురు సుస్మితను ఇచ్చిపెళ్లి  చేయాలని , వారితో సంబంధం కలుపుకోవాలని కూడా భావించారు. అలాగే చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఎంగేజ్మెంట్ కూడా జరిపించారు. కానీ ఉదయ్ కిరణ్ ఆ తర్వాత తీసుకున్న నిర్ణయంతో వారి మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది. అయితే ఉదయ్ కిరణ్ కి సుష్మతితో ఎంగేజ్మెంట్ కి ముందే మరో లవ్ స్టోరీ ఉందట. ఆయన ఓ అమ్మాయిని ఎంతో గాఢంగా ప్రేమించాడట. అయితే ఆమె ఉదయ్‌కు మోసం చేసింది. అయితే ఆమె ఓ లేడీ జర్నలిస్ట్ కావ‌టం ఇక్కడ మరో విశేషం .. ఉదయ్ కిరణ్ హీరోగా ఎదుగుతున్న సమయంలో ఓ లేడీ జర్నలిస్ట్ ఆయన్ని ఓ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ సమయంలోనే  ఆయన బాగా ఇంప్రెస్ అయ్యాడు. ఇక దాంతో ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. తర్వాత ఆ బంధం కాస్త ప్రేమగా మారిందట. కొంతకాలం ప్రేమించుకున్న ఈ ఇద్దరి మధ్య మనస్పర్థాలు పెరిగాయని ఆ చిన్న చిన్నగా పెరుగుతూ పెద్దదై బ్రేకప్ చెప్పుకునే వరకు వెళ్లిందట.

అయితే ఉదయ్ కిరణ్ కి ఆమె ముందు బ్రేకప్ చెప్పిందని ఉదయ్ అక్క శ్రీదేవి చెప్పడం ఇక్కడ మరో విశేషం. అలా డిప్రెషన్  లోకి వెళ్లిన ఉదయ్ కిరణ్ అది తన సినమాలపై ప్రభావం చూపించే అంతవరకు కూడా వెళ్ళింది. ఆ సమయంలో వరుస విజయాలతో ఉన్న ఉదయ్ కిరణ్ కి చిరంజీవి ఎంతో సపోర్టుగా నిలిచారు. ఇక చాలాసార్లు మెగాస్టార్ ముందు ఏడ్చినట్లు కూడా ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి చెప్పింది . ఆ సమయంలోనే చిరంజీవి ఇలా తన కూతురు సుస్మిత పెళ్లి మ్యాటర్‌ తెలిపారట. ఉదయ్‌ కూడా కన్విన్స్ అయి పెళ్లికి ఒప్పుకున్నారట. వీరికి ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. కానీ ఆ తర్వాత క్యాన్సిల్‌ చేసుకున్నారు. ఉదయ్‌ కిరణ్‌ నో చెప్పడం వల్ల చిరంజీవికి కోపం వచ్చిందని, దీంతో అవకాశాలు రాకుండా చేశాడనే ప్రచారం ఉంది. నిజమేంటనేది తెలియాల్సి ఉంది. ఆ తర్వాత ఉదయ్‌ కిరణ్‌.. సాఫ్ట్ వేర్‌ అమ్మాయిని 2012లో మ్యారేజ్‌ చేసుకున్నారు. రెండేళ్లకే ఆయన ఆత్మహత్య  చేసుకున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: