పుష్ప 2 ఫస్ట్ డే ఓపెనింగ్స్.. ఐకాన్ స్టార్ దెబ్బకి ఏదైనా మడతడి పోవాల్సిందే..!

Amruth kumar
 టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అందుకొని అదిరిపోయే క్రేజ్‌ని తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఆ సినిమాకి సీక్వల్ గా వస్తున్న పుష్ప 2 సినిమాతో మరోసారి బాక్సాఫీస్ రికార్డులను చీల్చి చెండాలడానికి రెడీ అవుతున్నాడు ఐకాన్ స్టార్. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై ఇప్పటికే అంచనాలు ఎవరు ఊహించని స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్లో పుష్ప 2 పై ఎవరు ఉహించ‌ని రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుకునే ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెర్కకించాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. ఐటెం సాంగ్ - క్లైమాక్స్ ఫైట్ మినహా అంతా ఫినిష్ అయింది. ఈనెల చివరి వారంతో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ , పాటలు సినిమాపై అంచనాలు పెంచేసాయి.

అయితే ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర పాన్ ఇండియా సినిమాల క్రేజ్ గట్టిగా నడుస్తుంది. ఈ క్రమంలోనే పుష్ప 2 తొలిరోజు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుంది అనేది ఇప్పుడు అందరిలో హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా వచ్చిన కల్కి - దేవర సినిమాలు మొదటి రోజే 200 కోట్లకు దగ్గర ఫస్ట్ డే కలెక్షన్లు అందుకున్నాయి. ఇప్పుడు పుష్ప 2 మొదటి రోజు ఎలాంటి కలెక్షన్లు అందుకుంటుంది అనేది ప్రముఖ ఫిల్మ్‌ బాక్సాఫీస్ అనలిస్టుల అంచనాల ప్రకారం.. ఈ సినిమా మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా కలెక్షన్ లో రాబడుతుందని అంటున్నారు. కేవలం ఒక్క ఇండియాలోనే 200 కోట్లకు పైగా రావొచ్చని అంచనా వేస్తున్నారు.

అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి రోజు 85 కోట్లకు పైగా షేర్ వచ్చే అవకాశం ఉందట. అలాగే ఓవర్సీస్ లో కూడా రిలీజ్ రోజే 60 కోట్లకు పైగా కలెక్షన్లు వస్తాయని అంటున్నారు. ఈ రేంజ్ వసూళ్లు సాధించగలిగితే, పుష్ప 2 తొలి రోజే మొత్తం రూ. 270 కోట్లను దాటిపోనుంది. ఇంత భారీ అంచనాలతో విడుదలవుతున్న పుష్ప 2 పై ఇండస్ట్రీలో ఉత్కంఠ నెలకొంది. అల్లు అర్జున్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి పార్ట్‌లో అల్లు అర్జున్ పోషించిన పుష్పరాజ్ పాత్రకు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభించడంతో, ఈ సీక్వెల్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ‘పుష్ప 2’ వసూళ్లతో పాత రికార్డులను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: