కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగినటులలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ తాజాగా అమరన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని అమరన్ అనే పేరుతోనే తెలుగులో కూడా విడుదల చేశారు. ఈ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగులో కూడా అక్టోబర్ 31 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ కి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ టాక్ రావడంతో ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయి రేంజ్ కలెక్షన్లను వసులు చేస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఎనిమిది రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ ఎనిమిది రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ... వచ్చిన లాభాల గురించి తెలుసుకుందాం.
8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 6.19 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.95 కోట్లు , ఆంధ్ర ఏరియాలో 5.29 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 13.43 కోట్ల షేర్ ... 22.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక 5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగినట్లు సమాచారం. 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని 7.93 కోట్ల లాభాలను అందుకుంది. ఇలా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేస్తూ ఫుల్ జోష్లో దూసుకుపోతుంది.