వేణుమాధవ్ లోటు తీర్చే స్టార్ కమెడియన్.. టాలీవుడ్ సరిగ్గా వాడటం లేదయ్యా..!
ఇప్పటికే రచ్చ రవి దాదాపు 150కు పైగా సినిమాల్లో నటించిన ఇంకా జబర్దస్త్ కమెడియన్ గానే చూస్తున్నారు.. సరైన గుర్తింపు మాత్రం ఇండస్ట్రీ ఆయనకి ఇవ్వలేక పోతుంది. ఆయన నటించే పాత్రులకు నూటికి నూరు శాతం నాయం చేస్తున్న రచ్చ రవి.. ఎంతో భోల మనిషిగా చిత్ర పరిశ్రమలో అందరితో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఆ ఇన్ని పూర్తిస్థాయి కమిడియన్గా మాత్రం ఏ దర్శకుడు వాడుకోలేకపోతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాల్లో ఒకటి రెండు సన్నివేశాలకు మాత్రమే ఆయన్ని పరిమితం చేస్తూ ఆయనలోని కమెడియన్ ని కామెడీని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు.
ప్రస్తుతం ఉన్న మన స్టార్ కమెడియన్సులో బ్రహ్మానందం కూడా సినిమాలు తగ్గించారు. ప్రస్తుతం ఫామ్ లో ఉన్న కమెడియన్సులో వెన్నెల కిషోర్ , సత్యం మాత్రమే వరస సినిమాలు చేస్తున్నారు. గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్, ఆలీ లాంటి వారి మధ్య కూడా వేణుమాధవ్ లాంటి వారికి అప్పట్లో మంచి స్పేస్ ఉండేది .. కానీ ఇప్పుడు ఒకటే రొటీన్ గా వారినే తిప్పి తిప్పి మన దర్శకులు సినిమాల్లో చూపిస్తున్నారు తప్ప రచ్చ రవి లాంటి వారికి పెద్దగా అవకాశాలు అయితే ఇవ్వటం లేదని చెప్పాలి. అలాగే రచ్చ రవికి ఉన్న మరో టాలెంట్ మిమిక్రీ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిరంజీవి- బాలకృష్ణ వంటి అగ్ర హీరోల సినిమాల్లోనూ అవకాశాలు అందుకున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయిన అటు ఆంధ్ర ఇటు రాయలసీమ యాసలను కూడా పర్ఫెక్ట్ గా దించగల సామర్థ్యం రచ్చ రవికి ఉంది. ఇలా ఎంతో టాలెంట్ ఉన్న రచ్చ రవిని మన దర్శకులు ఇప్పటికైనా గుర్తించి సరైన అవకాశాలు ఇచ్చి ఆయన్ని వాడుకోవాలని కూడా అంటున్నారు.