సీనియర్ హీరోయిన్‌ సుహాసిని ఆ స్టార్ హీరోయిన్ పెళ్లి చెడగొట్టాలని చూసిందా.. అంత కథ నడిపించిందా..!

Amruth kumar
ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమలో తన నటనతో తనకంటూ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్న సీనియర్ హీరోయిన్ సుహాసిని గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు .. అలాగే సుహాసిని అన్నా  హీరో కమలహాసన్ అనే విషయం చాలా మందికి తక్కువగా తెలుసు. ఈమె భర్త సౌత్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం.. చిన్నతనం నుంచే సినిమాలపై ఇంట్రెస్ట్ ఉన్న సుహాసిని చిత్ర పరిశ్రమలోకి వచ్చి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. సౌత్ లో ఈమె అన్ని ఇండస్ట్రీలో మంచి పేరున్న హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అలాంటి సీనియర్ హీరోయిన్ గతంలో తనతో పాటు నటించే మరో హీరోయిన్ పెళ్లిని చెడగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు కూడా చేసిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు .. ఎందుకు ఆమె పెళ్లి సుహాసిని చెడగొట్టాలని చూసింది అనే విషయాలు ఇక్కడ చూద్దాం.

ఇక చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరో హీరోయిన్ల మధ్య మంచి స్నేహం కొనసాగుతూనే ఉంటుంది .. అలానే సుహ‌సినికి అప్పట్లో మరో హీరోయిన్ సుమలత మధ్య మంచి స్నేహం ఉండేది. ఇద్దరి మధ్య ఉన్న మంచి స్నేహబంధం కారణంగా సుమలత మరో కన్నడ హీరో అంబరీష్ ని పెళ్లి చూసుకుంటున్న సమయంలో సుహాసిని వారికి అడ్డుపడిందట. అంతే కాకుండా ఆయన పెద్ద రౌడీలా ఉంటాడు నీకు అసలు సెట్ అవ్వడు నువ్వు ఎంతో సాఫ్ట్ నేచర్ కలిగిన అమ్మాయివి పెళ్లి చేసుకోకు అని చెప్పింది అట అయినా కూడా సుమలత నేను ఆయన్ని ప్రేమించాను అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నీ చావు నువ్వు చావు అని అక్కడే వదిలేసిందట.

అలాగే వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో ఒక్కరోజు బెంగళూరు వెళ్లిన సుహాసిని సుమలత ఇంటికి కూడా వెళ్లిందట .. అయితే సుహాసిని ఇంటికి వెళ్లడంతోనే నటుడు అంబరీష్ ఏంటమ్మా నీకు నేను ఏమైనా అన్యాయం చేశానా..? ఎందుకు నా పెళ్లి చెడగొట్టాలని చూసావు? అయినా నీకు నేను రౌడీలా కనిపిస్తున్నానా అంటూ కడిగిపారేసారట. అయితే సరదాగా మాత్రమే అంబరీష్ సుహాసినిని అలా అడిగారట. ఇక ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పి నవ్వుకుంది సుహాసిని .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: