కొన్ని సందర్భాలలో ఒకే రకమైన కథతో సినిమాలు వచ్చిన అలాంటి సినిమాలలో చాలా సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక కొన్ని సందర్భాలలో మాత్రం ఒక రకమైన కథతో సినిమా వచ్చి ఆ తర్వాత మళ్లీ దాదాపు అలాంటి కథతో సినిమా వస్తే ఫ్లాప్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మహేష్ బాబు హీరోగా రూపొందిన సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో దాదాపు అలాంటి కథతోనే చిరంజీవి ఓ సినిమా చేయగా అది ఫ్లాప్ అయినట్లు ఓ వార్త ఈ మధ్య కాలంలో వైరల్ గా మారింది. అసలు ఆ విషయం ఏమిటో తెలుసుకుందాం.
కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమాలో హీరో మొదట సిటీలో ఉంటాడు. ఆ తర్వాత ఓ పల్లెటూరుకి వెళ్తాడు. ఆ తర్వాత అతను అక్కడ ఉన్న ప్రజల కష్టాలను తీర్చుతూ ఆ ఊరి నుండి ఎవరిని బయటకు వెళ్లకుండా చూస్తూ ఉంటాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే శ్రీమంతుడు సినిమా వచ్చిన కొన్ని సంవత్సరాలకు కొరటాల శివ , చిరంజీవితో ఆచార్య అనే మూవీ ని రూపొందించాడు.
ఈ సినిమాలో చిరంజీవి మొదట అడవుల్లో ఉంటాడు. ఆ తర్వాత ధర్మస్థలి అనే ప్రాంతంలో ప్రజలకు కష్టాలు రావడంతో అక్కడికి వస్తాడు. ఇక అక్కడి ప్రజలు కూడా అక్కడ ఉన్న కొంత మంది వ్యక్తుల అరాచకాలను తట్టుకోలేక ఊరి నుండి వెళ్ళిపోతూ ఉంటే వారికి నచ్చచెప్పి వారిని ఊర్లో ఉంచుతాడు. ఇక దాదాపు ఈ రెండు కథలు కాస్త దగ్గరగా ఉంటాయి. దీనిలో శ్రీమంతుడు మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోగా , ఆచార్య మూవీ మాత్రం భారీ అపజయాన్ని ఎదుర్కొంది.