"ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు".. సెన్సేషనల్ విషయాన్నీ బయటపెట్టిన సమంత..!
ఆమె ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సిటాడిల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ బిజీ బిజీగా ఉంది . ఈ క్రమంలోనే అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ చిట్ చాట్ లో ఓ అభిమాని సమంతను పదేపదే ఒక ప్రశ్నతో విసిగించారు . దానికి చాలా చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చింది సమంత. ఇక ఎవ్వరు అడగకూడదు అనే విధంగా అలాంటి ఆన్సర్ ఇచ్చింది. " సమంత మీరు బాగా సన్నగా అయిపోతున్నారు. బరువు తగ్గిపోతున్నారు . మీరు అందంగా కనిపించడం లేదు . కొంచెం బరువు పెరగండి మేడం" అంటూ సజెస్ట్ చేశారు . అయితే సమంత చాలా నెమ్మదిగానే ఘాటుగానే బదులిచ్చింది.
"నా హెల్త్ ఎలా ఉందో నాకు తెలుసు.. నా బరువుకి నా హెల్త్ కి చాలా చాలా కనెక్ట్ ఉంది .. నేను బరువు పెరిగితే రకరకాల సమస్యలు వస్తాయి.. నా హెల్త్ ఏ నాకు ఇంపార్టెంట్ ..నేను బరువు పెరిగితే నాకు ఎలాంటి సమస్యలు వస్తాయో నాకు ముందే తెలుసు ..అందుకే బరువు పెరగడం లేదు.. హెల్త్ కేర్ ఇంపార్టెంట్ " అంటూ చాలా చాలా మెచ్యూరిటీగా ఆన్సర్ ఇచ్చింది. సోషల్ మీడియాలో సమంత ఆన్సర్ వైరల్ గా మారింది. అంతేకాదు కొందరు నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్లి చేసుకోవడం పట్ల రకరకాలుగా స్పందిస్తున్నారు. సమంతకి వాళ్ళిద్దరి రిలేషన్ గురించి ఎప్పుడో తెలుసు అని.. అందుకే ఆమె నిజ స్వరూపం తెలిసి అక్కినేని ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేసింది అని కూడా మాట్లాడుకుంటున్నారు . అసలు నిజానిజాలు ఏంటో సమంత - నాగచైతన్య - ఆ దేవుడికే తెలియాలి..!