నటరత్న ఎన్టీఆర్ చివరి రోజు అంత బాధపడ్డారా? ఏఎన్నార్ చెప్పిన ఈ మాటలు వింటే కన్నీళ్లాగవు..!
ఎంతో స్నేహంగా ఉన్న వీరి మధ్య కొంతకాలం గ్యాప్ కూడా వచ్చిందని అంటారు. ఎన్టీఆర్ కావాలని ఏఎన్నార్ ని దూరం పెట్టారని కూడా కొందరు చెబుతుంటారు. అయితే ఇందులో ఎంత వరకు నిజాలు ఉన్నాయి అనేది వారికే తెలుసు. ఎన్టీఆర్ గురించి ఎవరికీ తెలియని రహస్యాన్ని ప్రముఖ రచయిత కృష్ణకుమారి గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చారు. చిత్ర పరిశ్రమలో ఉన్న కొందరు వ్యక్తులు వల్లే వీరి మధ్య దూరం వచ్చిందని కానీ ఆ తర్వాత వీరిద్దరూ కలిసిపోయారని కృష్ణకుమారి ఆ ఇంటర్వ్యూ అన్నారు.
అయితే ఒకసారి తాను నాగేశ్వరరావు గారి ఇంట్లో ఉన్న సమయంలో ఎన్టీఆర్ నుంచి ఫోన్ వచ్చిందని ఫోన్ రాగానే ఎంతో బాగోద్వేగానికి నాగేశ్వరరావు గారు లోనయ్యారని ఆమె అన్నారు. ఏఎన్నార్ తో ఎన్టీఆర్.. నాకు నిన్ను చూడాలని ఉంది నీకు నా మనసులో మాట చెప్పుకోవాలని ఉంది ఒకసారి మా ఇంటికి వస్తారా బ్రదర్ అంటూ ఎన్టీఆర్ నాగేశ్వరరావును అడిగారట. ఎన్టీఆర్ మాటలకి ఏఎన్నార్ ఎంతో చలించిపోయారట. ఏంటి బ్రదర్ ఇలా అంటున్నారు. ఈ మధ్యనే కదా మనం భోజనానికి కలిసాం.. అని అనగానే.. లేదు బ్రదర్ మీతో మాట్లాడాలి అని ఎన్టీఆర్ అనడంతో ఏ ఎన్నార్ కూడా తప్పకుండ కలుద్దాం అని అన్నారట. ఈ విషయాన్నీ ఏఎన్నార్ తన భార్యతో కూడా పంచుకున్నారట. కానీ ఈ ఫోన్ వచ్చిన మరుసటిరోజే ఎన్టీఆర్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారట. అవే ఎన్టీఆర్ ఏఎన్నార్ తో మాట్లాడిన చివరి మాటలు అని కృష్ణ కుమారి చెప్పుకొచ్చారు.