ఇండ‌స్ట్రీలో బాల‌య్య ఒక్క‌డిదే ఆ రికార్డ్‌..100 కాదు 300 రోజులు ఒకే థియేటర్‌ ?

Veldandi Saikiran
నందమూరి బాలకృష్ణ తన సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. అయినప్పటికీ అందులో కొన్ని సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టాయి. అలాంటి సినిమాలలో నరసింహనాయుడు సినిమా ఒకటి. ఈ సినిమా సినీ ఇండస్ట్రీలోనే హిట్ చిత్రంగా నిలిచింది. 2001 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన నరసింహనాయుడు సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 105 కేంద్రాల్లో 100 రోజులు ఆడి రికార్డుల్లోకి ఎక్కింది.

ఈ సినిమా పల్లెటూర్లలో కూడా రిలీజ్ అయ్యి శత దినోత్సవ వేడుకలను జరుపుకుంది. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోటలో మొదటిసారి రిలీజ్ సినిమాగా శ్రీ లక్ష్మీ టాకీస్ లో విడుదల అయింది. సీ సెంటర్ అయిన ఈ ఊరిలో డైరెక్ట్ నాలుగు ఆటలతో నాలుగు రోజులు ఆడి కామవరపుకోట చరిత్రలో శత దినోత్సవ సినిమాగా నిలిచిపోయింది.

ఇక కర్నూలు జిల్లా గూడూరు కోడుమూరులో కూడా ఈ సినిమా రికార్డు క్రియేట్ చేసింది. ఈ రెండు గ్రామాలు పక్క పక్కనే ఉన్నప్పటికీ సింగిల్ ప్రింట్ తో ఈ రెండు చోట్ల శత దినోత్సవం జరుపుకొని సక్సెస్ ఫుల్ గా నిలిచింది. ఈ క్రమంలోనే ఏలూరులో అంబికా కాంప్లెక్స్ లో నరసింహనాయుడు ఆల్ ఇండియా వైడ్ గా చెక్కుచెదరని రికార్డులను నమోదు చేసుకుంది. ఈ కాంప్లెక్స్ ప్రముఖ నిర్మాత వ్యాపారవేత్త అంబికా కృష్ణది. నరసింహనాయుడు సినిమాతో మినీ అంబికా థియేటర్ ప్రారంభించారు. బాలయ్యకు వీరాభిమాని అయిన అంబికా కృష్ణ ఆయన చేతుల మీదుగానే థియేటర్ ను ప్రారంభించారు.

ఇక 11 జనవరి 2001న మినీ అంబికా థియేటర్ నరసింహనాయుడు సినిమాతో ప్రారంభించారు. ఈ ఒక్క థియేటర్లోనే ఈ సినిమా అనుకున్నారట. అయితే మొదటి రోజు మొదటి షోకే సినిమాకు యునానమస్ బ్లాక్ బస్టర్ రావడంతో క్రౌడ్ విపరీతంగా పెరిగిపోయింది. మొత్తంగా అంబికా థియేటర్‌ 300 రోజులు ఆడింది. ఇక ఈ సినిమా పలుచోట్ల రిలీజ్ అయ్యి భారీ రికార్డులను నమోదు చేసుకుంది. బాలయ్య బాబు కెరీర్ లోనే మంచి సక్సెస్ఫుల్ సినిమాగా నరసింహనాయుడు సినిమా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: