సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఆ నిర్మాత అంటే అంత కోపమా.. వీరి మధ్య అంత యవ్వారం నడిచింది గా..!

Amruth kumar
ఇక మన తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తెలియని వారు ఉండరు. ఇప్పటికే ఐదు పదిల వయసు దాటిన 20 ఏళ్ల కుర్రాడులా కనిపించే అందం మహేష్ కు సొంతం. అలాంటి ఈ స్టార్ హీరో ఇప్పటివరకు ఇండస్ట్రీలో వివాదాలు కు దూరంగా ఉన్నాడు . అలాంటి ఆయనకు ఇండస్ట్రీలో ఓ బద్ధ శత్రువు ఉన్నారట. ఎంతో మంచి మనసున్న మహేష్ బాబును ఇబ్బంది పట్టిందెవరు ఆయన ఎందుకు మహేష్ కు శత్రువుగా మారాడు అనేది ఇక్కడ చూద్దాం.

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడుగా టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు మహేష్ .. అలాంటి ఆయన నటన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ప్రస్తుతం వరుస‌ విజయాలతో దూసుకుపోతున్న మహేష్ .. గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారట. ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తే ఆయనను చాలా మంది ఎన్నో రకాలుగా కామెంట్లు కూడా చేశారు. అసలు ఆయనకు యాక్టింగ్ వచ్చా అని  అసలు ఆయన మొహం చూడు అసలు మీసాలు లేవు..  అని విమర్శలు చేశారు. అయితే గతంలో ఒక్కడు సినిమాని మహేష్ తో చేస్తానని ఓ స్టార్  డైరెక్టర్ ఓ బడ నిర్మాత వ‌ద్దకు వెళ్లి స్టోరీ చెప్పారట. అయితే ఆ నిర్మాత మహేష్ హీరో అయితే అసలు ఆ సినిమా నేను చేయను అంటూ మొహం మీద చెప్పేసారట.  

అసలు అతనికి యాక్టింగ్ రాదు అంటూ ఆ డైరెక్టర్ ను అక్క‌డ‌ నుంచి పొమ్మన్నాడట. అయితే ఈ విషయం కొన్ని రోజులకు మహేష్ చెవిలో పడింది. ఆ మాటలు కసిగా తీసుకున్న మహేష్ ఆ నిర్మాత పై ఎలాగైనా రివేంజ్ తీసుకోవాలని భావించారట. తనకు వచ్చిన సినిమా ఆఫర్లను వదులుకోకుండా తన నటనా చాతుర్యంతో అద్భుతంగా నటించి వరుస విజయాలు అందుకుంటూ వచ్చారు. ఆ సమయంలో ఒక్కడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు ఆయనకు వరుస‌ అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత ఆ నిర్మాత మహేష్ బాబు వద్దకు వచ్చి తల దించుకునే పరిస్థితి కూడా వచ్చింది .. అలా మహేష్ బాబు ప్రస్తుతం ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా దూసుకుబోతున్నాడు.. అలాగే ప్రస్తుతం రాజమౌళితో భారీ పాన్‌ వరల్డ్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాతో మహేష్ బాబు క్రేజ్ హాలీవుడ్ స్థాయికి వెళుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: