ఏందయ్యా ఇది.. ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ భానుప్రియ చెల్లెలా..!

Amruth kumar
చిత్ర పరిశ్రమ లో ఒకప్పుడు హీరోయిన్స్ గా మెప్పించి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు .సీనియర్ హీరోలు అయితే విలన్సుగా మారుతుంటే .. చాలా మంది సీనియర్ హీరోయిన్లు అమ్మ , అత్త పాత్రలు చేసి అభిమానులను మెప్పిస్తున్నారు . అలాంటి వారిలో భానుప్రియ కూడా ఒకరు. భానుప్రియ అంటే ఒకప్పుడు ఓ సెన్సేషన్ .. చిత్ర పరిశ్ర‌మ‌లో స్టార్ హీరోయిన్గా రాణించిన భానుప్రియ.. ఆరోజు ల్లోనే హీరోయిన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. అలాగే ఆమె కోసమే సినిమాలు చూసే వారు కూడా చాలా మంది ఉన్నారు .. అలాగే స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురు చూసేవారు . తన అందంలో నటనలోనూ ఆమెకు ఎవరూ పోటు లేరని నిరూపించారు భానుప్రియ .

దాదాపు మన సీనియర్ స్టార్ హీరోలు అందరితో కలిసి నటించిన భానుప్రియ.. వెంకటేష్ , నాగార్జున , బాలకృష్ణ , చిరంజీవి లాంటి హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు . ఇక ప్రస్తుతం ఈమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాల్లో నటిస్తున్నారు .. చత్రపతి సినిమాలో ప్రభాస్ తల్లిగా ఎంతో అద్భుతంగా నటించి మెప్పించారు భానుప్రియ . అయితే భానుప్రియ చెల్లి కూడా హీరోయిన్ అనే విషయం చాలా మందికి తెలియదు .. ఆమె కూడా టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు నటించింది . ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది .. ఏం చేస్తుంది .. అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం .
 
ఇంతకీ భానుప్రియ చెల్లి పేరు శాంతి ప్రియ .. ఈమె కాబోయే అల్లుడు అనే సినిమా తో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. అలాగే సింహాసనం ,యమభాసం ,ర‌క్త‌ కన్నీరు , అగ్ని, కలియుగ అభిమన్యుడు వంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది . అలాగే ఈమె టాలీవుడ్ తో పాటు తమిళం హిందీ భాషల్లో కూడా సినిమాలు చేసింది .. ప్రస్తుతం ఈమె సినిమాలు తగ్గించి వరుస హిందీ సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెరపై బిజీగా కొనసాగుతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: