పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు తన కెరియర్ లో ఎన్నో రీమిక్ సినిమాలలో హీరోగా నటించాడు. ఇక పవన్ కెరియర్ లో రీమిక్ సినిమాల ద్వారా అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కూడా పవన్ వరుస పెట్టి రీమిక్ సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో రీమిక్ సినిమాలు పెద్ద స్థాయిలో విజయాలను అందుకోవడం లేదు. దానితో పవన్ అభిమానులు ఆయన రీమిక్ సినిమాలు చేస్తున్న పద్ధతిపై కాస్త నిరుత్సాహంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
కానీ పవన్ మాత్రం ఓ విషయంలో ఆయన అభిమానులను తీవ్ర నిరుత్సాహ పరుస్తున్నట్లు తెలుస్తోంది. అదేమిటి అంటే రీమిక్ సినిమాల ద్వారా ఎన్నో విజయాలను అందుకున్న పవన్ ఈ మధ్య కాలంలో ఏకంగా తెలుగులో డబ్ అయ్యి విడుదల సినిమాలను కూడా రీమిక్ చేస్తూ వస్తున్నాడు. అలాంటి సినిమాలతో ఇప్పటికే పవన్ కి రెండు సార్లు అపజయాలు వచ్చాయి. కొంత కాలం క్రితం వీరమ్ అనే చేసే టైటిల్ తో తమిళ్లో విడుదల అయ్యి మంచి విజయం అందుకున్న సినిమాను తెలుగులో వీరుడోక్కడే పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమాను కాటమరాయుడు అనే పేరుతో పవన్ రీమిక్ చేశాడు. ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది. ఇక కొంత కాలం క్రితం వినోదయ సీతం అనే పేరుతో తెలుగులో విడుదల అయిన సినిమాను బ్రో అనే టైటిల్తో రీమిక్ చేశాడు. ఈ మూవీ కూడా ఫ్లాప్ అయ్యింది.
ఇక తమిళ్లో తేరి అనే టైటిల్తో విడుదల అయ్యి విజయం సాధించిన సినిమా తెలుగులో పోలీసోడు పేరుతో విడుదల అయింది. ప్రస్తుతం పవన్ హీరోగా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఈ సినిమాకు రీమేక్ అని ఓ వార్త చాలా కాలం వైరల్ అయింది. ఈ మూవీ కి స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేస్తున్న దశరథ్ ఇది తేరి మూవీకి రీమిక్ కాదు అని ప్రకటించాడు. దానితో పవన్ అభిమానులు ఈ సినిమా తేరి కి రీమేక్ కాకూడదు అనే వాదనను గట్టిగా వినిపిస్తున్నట్లు తెలుస్తుంది.