కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు
సినిమా మార్కెట్ చాలా చిన్నగా ఉండేది. మన సినిమాలు ఎక్కువ శాతం తెలుగు భాషలోనే విడుదల అయ్యేవి. దానితో పెద్ద మొత్తంలో కలక్షన్లు మన సినిమాలకు వచ్చేవి కావు. కానీ ఎప్పుడైతే
బాహుబలి సినిమా విడుదల అయ్యిందో అప్పటి నుండి తెలుగు
సినిమా రేంజ్ పెరిగిపోయింది. మన తెలుగు సినిమాలు ఎక్కువ శాతం చాలా భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్నాయి. దానితో వందల కోట్ల కలెక్షన్లు కూడా ఈజీగా తెలుగు సినిమాలకు వచ్చేస్తున్నాయి. ఇలా కలెక్షన్లు భారీగా రావడంతో రెమ్యూనరేషన్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి.
దానితో ఒకప్పుడు తెలుగు
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగిస్తున్న వారు కూడా
బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు చూసేవారు. కానీ ఇప్పుడు మాత్రం
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న బ్యూటీలు తెలుగు సినీ
పరిశ్రమ వైపు ఆసక్తి చూపుతున్న సందర్భాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే అనేక మంది
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు తెలుగు సినిమాల్లో నటించారు. అలాగే
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను కూడా సంపాదించుకున్నారు. దానితో చాలా మంది
టాలీవుడ్ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి దీపికా పదుకొనే కొంత కాలం క్రితమే తెలుగు
సినిమా అయినటువంటి
కల్కి 2898 AD అనే సినిమాలో కీలక ఎంపాత్రలో నటించింది. ఈ
మూవీ ద్వారా ఈమెకి మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే
బాలీవుడ్ ముద్దుగుమ్మ
జాన్వి కపూర్ తాజాగా
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర పార్ట్ 1 సినిమాలో హీరోయిన్గా నటించింది.
ఈ
మూవీ ద్వారా ఈమెకు
బ్లాక్ బస్టర్ విజయం దక్కింది. ఇక మరికొన్ని రోజుల్లోనే ఈమె
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోయిన్గా నటించబోతుంది. అలాగే మరికొన్ని తెలుగు సినిమాలకు కూడా ఈ
బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా
బాలీవుడ్ ముద్దుగుమ్మలు ప్రస్తుతం
టాలీవుడ్ పై చాలా ఇంట్రెస్ట్ ని చూపిస్తున్నట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.