నాగచైతన్య - శోభిత విడిపోయేలా ఆ మహిళ కుట్రలు ?

Veldandi Saikiran
సమంత, నాగచైతన్య ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని సంవత్సరాల పాటు కలిసున్న ఈ జంట అతి తక్కువ సమయంలోనే విడాకులు తీసుకున్నారు. తాజాగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల అనే హీరోయిన్ ను ప్రేమించి పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నాడు. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. అయితే వీరి నిశ్చితార్థం ఆగస్టు 8వ తేదీన జరిగింది. ఇక అదే రోజు ప్రముఖ వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి వీరిద్దరి జాతకం ప్రకారం వీరి కాపురం సజావుగా సాగదని చెప్పాడు.

పెళ్లయిన మూడు సంవత్సరాలకే వీరు వీడిపోతారని అన్నాడు. వీరి విడాకులకు గల కారణం ఓ మహిళ అని సంచలన కామెంట్స్ చేశాడు. వీరు నిశ్చితార్థం జరుపుకున్న సమయం బాగోలేకపోవడం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని అందువల్లనే వీరు విడిపోతారని అన్నాడు. ఇటువంటి ముహూర్తాలు ప్రతి ఒక్కరూ పెడతారు. కానీ అది మంచి ముహూర్తం కాదని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అన్నారు. వారిద్దరి జాతకాలను బాగా పరిశీలించి తాను ఈ విషయాన్ని చెబుతున్నానని చెప్పాడు. ఇక వీరు 2027లో విడిపోవడం కచ్చితంగా జరుగుతుందని తెలియజేశారు.

ఈ విషయం తెలిసిన అనంతరం నాగచైతన్య, శోభిత ఓ మహిళ కారణంగా విడిపోవడం ఏంటి? ఆ మహిళ ఎవరు అయి ఉంటారు అని నెటిజెన్లు తెగ చర్చలు జరుపుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో పేరు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.... తాజాగా సమంత తాను ఎంతో ఇష్టపడి నాగచైతన్యను పెళ్లి చేసుకున్నానని చెప్పింది. అనివార్య కారణాలవల్ల విడిపోయామని సమంత బాధపడింది. తన జీవితంలో మరో వ్యక్తికి చోటు లేదని, అంతేకాకుండా రెండో పెళ్లికి ఎటువంటి అవకాశాలు లేవని సమంత స్పష్టం చేసింది.

ఈ విషయం తెలిసిన అనంతరం సమంతపై ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. శోభితతో కాపురం చేస్తున్న సమయంలోనే నాగచైతన్య మళ్ళీ తిరిగి సమంత దగ్గరికి వెళతాడని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అందువల్లనే శోభితతో నాగచైతన్య విడిపోవాల్సి వస్తుందేమోనని అభిప్రాయాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. అంటే సమంత కారణంగానే శోభిత, నాగచైతన్య విడిపోతారని కొంతమంది నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: