కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమాల మార్కెట్ చాలా చిన్నగా ఉండేది. ఏదైనా సినిమాలకు 100 కోట్ల కలెక్షన్లు వచ్చాయి అంటే అది చాలా పెద్ద విషయంగా చూసేవారు. కానీ ప్రస్తుతం తెలుగు సినిమా స్వరూపం పూర్తిగా మారిపోయింది. స్టార్ హీరోల సినిమాలకు ఒక్క రోజే వంద కోట్లకి పైగా కలెక్షన్లు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇకపోతే స్టార్ హీరోలా సినిమాలకు ఈ స్థాయిలో కలెక్షన్లు వస్తూ ఉండడంతో వారు అదే స్థాయిలో పారితోషకాలను కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సౌత్ ఇండస్ట్రీ నుండి అత్యంత భారీ పారితోషకం తీసుకునే హీరోలలో విజయ్ ముందు వరుసలో ఉంటాడు అని అనేక సార్లు అనేక వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే.
కాకపోతే విజయ్ ని అల్లు అర్జున్ "పుష్ప 2" మూవీ తో బీట్ చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం తలపతి విజయ్ తన కెరియర్లో 69 వ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఈయన ఏకంగా 275 కోట్ల పారితోషకాన్ని తీసుకున్నాడు అని , ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీ హీరోలలో ఎవరు కూడా ఈ స్థాయి పారితోషకాన్ని తీసుకోలేదు అని ఓ వార్త వైరల్ అయింది. ఇకపోతే విజయ్ ని అల్లు అర్జున్ "పుష్ప పార్ట్ 2" మూవీ తో బీట్ చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే .. అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటించాడు.
ఈ మూవీ కోసం ఈయన ఏకంగా 300 కోట్ల పారితోషకాన్ని తీసుకున్నాడు అని ఓ వార్త వైరల్ అవుతుంది. దీనితో తలపతి విజయ్ కంటే కూడా అల్లు అర్జున్ ఎక్కువ పారితోషకాన్ని తీసుకొని సౌత్ ఇండస్ట్రీ లో భారీ పారితోషకం తీసుకున్న హీరోగా రికార్డు సృష్టించాడు అని కొంత మంది భావిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే పుష్ప పార్ట్ 2 మూవీ కి థియేటర్ , నాన్ థియేటర్ తో కలిపి 1000 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది.