చిరంజీవిని చూసి భయపడి.. సినిమాలు వదిలేద్దామనుకున్నా : నాగార్జున

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ఎంతోమంది రియల్ లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు అన్న విషయం తెలిసిందే.అయితే నేటితరం హీరోలలో మాత్రమే కాదు ప్రస్తుతం సీనియర్ హీరోలు అని పేరు తెచ్చుకున్న వారిలో కూడా ఇలాంటి స్నేహబంధం చాలామంది హీరోల మధ్య ఉంది. ఇలా ఎప్పుడూ తమ ఫ్రెండ్షిప్ తో ప్రేక్షకులను ఫిదా చేసే సీనియర్ హీరోలలో అక్కినేని నాగార్జున మెగాస్టార్ చిరంజీవి ఒకరు అన్న విషయం తెలిసిందే.

 వీరిద్దరి మధ్య కొన్ని దశాబ్దాల నుంచి మంచి స్నేహబంధం కొనసాగుతుంది. ఇద్దరూ ఎక్కడ కలిసిన కూడా ఆత్మీయ ఆలింగణం చేసుకొని ఒకరి బాగోగులు ఒకరు తెలుసుకుంటూ ఉంటారు. కాస్త ఖాళీ సమయం దొరికిందంటే చాలు ఒకచోట చేరి సమయం గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి తన ప్రియ స్నేహితుడు అయిన చిరంజీవి గురించి ఇటీవల నాగార్జున ఒక ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలలో భాగంగా అటు మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని అవార్డు వరించింది అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే ఈ అవార్డుల ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకుంటూ ఒక ఆసక్తికర సన్నివేశాన్ని వివరించారు నాగార్జున. నేను సినిమాల్లోకి రావాలనుకున్న సమయంలో ఒకసారి అన్నపూర్ణ స్టూడియోస్ లోనే చిరంజీవి సినిమా షూటింగ్ జరుగుతుంది. అప్పుడు సినిమాల్లోకి రావాలనుకుంటున్నావుగా ఒకసారి వెళ్లి చిరంజీవి డాన్స్ చూడు అని మా నాన్న చెప్పారు. అక్కడ రైన్ సాంగ్ షూట్ జరుగుతుంది. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో చిరు రాదా తో కలిసి డాన్స్ చేస్తున్నారు. ఆయన గ్రేస్ చరిష్మా చూసి నాకు మనసులో గుబులు పుట్టింది. ఇక ఆయనలా మనం డాన్స్ చేయగలమా.. అసలు చేయలేం. అందుకే సినిమా ఇండస్ట్రీ వదిలేసి మరో కెరియర్ గురించి ఆలోచించాలని భయపడిపోయాను అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: