ఇండస్ట్రీ హిట్స్ విషయంలో ... ఆ రికార్డ్ బి. గోపాల్ దే.. ఎప్పటికీ ఎవరు టచ్ చేయలేరుగా..!

Amruth kumar
తెలుగులో మాస్ హీరోయిజానికి కొత్త నిర్వచనం ఇచ్చిన దర్శకుడాయన. అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో కమర్షియల్ మాస్ యాక్షన్ చిత్రాలకు ఆయనే కేరాఫ్ అడ్రస్. అదేవిధంగా టాలీవుడ్ లో ఫ్యాక్షన్ సినిమాలతో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన దర్శకుడు కూడా బి గోపాల్.. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ప్రతిధ్వని’, ‘లారీ డ్రైవర్’, ‘స్టేట్ రౌడీ’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’, ‘బొబ్బిలిరాజా’, ‘అసెంబ్లీ రౌడీ’,‘సమర సింహా రెడ్డి’, ‘నరసింహా నాయుడు’,ఇంద్ర’ ఒకటా రెండా ఎన్నో టాలీవుడ్ బ్లాక్ బస్టర్స్‌ను అందించిన ఘనత బి.గోపాల్ ది.టాలీవుడ్ అగ్రహీరోలందరితో సినిమాలు తెరకెక్కించి హిట్స్ అందించిన అతికొద్ది దర్శకుల్లో  బి.గోపాల్ ఒకరు. ముందుగా పి.చంద్రశేఖర్ రెడ్డిగా అసిస్టెంట్‌గా చేరిన బి.గోపాల్.. ఆ తర్వాత దర్శకేంద్రుడు   కె.రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పలు సినిమాలకు కో డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత డి. రామానాయుడుకు చెందిన సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘ప్రతిధ్వని’తో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకొని మొదటి సినిమాతోనే భారీ సక్సెస్‌ను అందుకున్నాడు.

ఆ తర్వాత ప్రతిధ్వని చిత్రాన్ని హిందీలో అనిల్ కపూర్, రేఖలతో ‘ఇన్షాఫ్ కీ అవాజ్’పేరుతో రీమేక్  తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు. అలాగే ఆ తర్వాత కలెక్టర్ గారి అబ్బాయి , రక్త తిలకం వంటి విజయాలతో టాలీవుడ్ లో దూసుకుపోయాడు అలాగే ఒక్కో హీరోతో బి గోపాల్ బాండింగ్ కూడా చాలా బాగుంది అని చెప్పాలి. ముఖ్యంగా చిరంజీవితో బి.గోపాల్ తీసిన ‘స్టేట్‌రౌడీ’, ‘ఇంద్ర’ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇంద్ర సినిమా కూడా బి గోపాల్ పుట్టినరోజున విడుదల కావడం విశేషం.  అలాగే వెంకటేశ్‌తో ‘బొబ్బిలిరాజా’, ‘చినరాయుడు’ వంటి సక్సెస్‌ఫుల్ మూవీలు అందించిన ఘనత కూడా బి.గోపాల్ దే. ఇంకోవైపు సీనియర్ హీరో మోహన్ బాబుతో తెరకెక్కించిన ‘అసెంబ్లీ రౌడీ’, ‘బ్రహ్మ’, ‘అడివిలో అన్న’ మూవీలు కూడా బ్లాక్ బస్టర్ సినిమా అదేవిధంగా హీరోగా మోహన్ బాబు సెకండ్ ఇన్నింగ్స్ లో బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన అసెంబ్లీ రౌడీ సినిమానే ఆయన కెరీర్ కు చాలా ఉపయోగపడింద‌ని చెప్పాలి. ఈ సినిమా తర్వాత మోహన్ బాబు మళ్లీ విలన్ కామెడీ వేషాలు చేయలేదు. అదేవిధంగా తెలుగులో బాలకృష్ణ - బి గోపాల్ ది సూపర్ హిట్ కాంబినేషన్ అని అంటారు.

వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన లారీడైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ , సమరసింహారెడ్డి , నరసింహనాయుడు వంటి సినిమాలు టాలీవుడ్ లో కొత్త ట్రెండ్‌ను మొదలుపెట్టి ఇండస్ట్రీ హిట్ సినిమాలుగా నిలిచాయి. వీటి తర్వాత వచ్చిన ‘పలనాటి బ్రహ్మానాయుడు’ మాత్రం ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. అప్పటి అగ్ర హీరో ఎన్టీఆర్ మినహా ఏఎన్నాఆర్, కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు, వెంకటేశ్, నాగార్జున వంటి అగ్రహీరోలతో సినిమాలు తెరకెక్కించాడు బి.గోపాల్. అంతేకాదు ఇప్పటి జనరేషన్ హీరోలైన మహేశ్‌తో ‘వంశీ’, జూనియర్ ఎన్టీఆర్‌తో ‘అల్లరిరాముడు’, ప్రభాస్‌తో ‘అడవిరాముడు’, రామ్‌తో మస్కా, గోపిచంద్‌తో ‘ఆరడుగుల బుల్లెట్ వంటి సినిమాలు నిర్మించిన ట్రాక్ రికార్డు బి.గోపాల్ సొంతం.ఈయన చివరగా డైరెక్ట్‌గా చేసిన ‘ఆరడుగుల బుల్లెట్’ మాత్రం థియేటర్‌లో విుడదలకు నోచుకోలేదు. ఇలా మొత్తంగా తన 35 ఏళ్ల సినీ జీవితంలో దాదాపు 31 సినిమాలను ఆయన తెర్కెక్కించారు. అందులో ఎక్కువ మటుకు బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించారు.ఈయన డైరెక్ట్ చేసిన ఎక్కువ చిత్రాలకు పరుచూరి బ్రదర్స్  మాటలు రాయడం విశేషం. మొత్తానికి టాలీవుడ్ సినీ ప్రస్థానంలో దర్శకుడిగా బి.గోపాల్ చెరగని ముద్ర వేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: