తీసింది మూడే సినిమాలు.. కానీ కొట్టింది ఇండస్ట్రీ రికార్డులు.. నాగ్ అశ్విన్ రూటే వేరు?

praveen
సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో అతి కష్టమైన విషయం ఏదైనా ఉంది అంటే అది ప్రేక్షకులను మెప్పించడమే. ప్రేక్షకులు ఎప్పుడు ఏది ఇష్టపడతారు అనే విషయాన్ని గ్రహించడమే. అయితే ఈ విషయాన్ని గ్రహించలేక ఎంతో మంది డైరెక్టర్లు హీరోలు డీల పడిపోతూ ఉంటారు. కెరీయర్ని చేజేతులారా నాశనం చేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది డైరెక్టర్లు హీరోలు ఏకంగా ప్రేక్షకుల నాడిని పట్టేసి వారు నచ్చి నచ్చే సినిమాలను తీసి సూపర్ హిట్ లు కొట్టడం చేస్తూ ఉంటారు. కెరియర్ లో సక్సెస్ రేటును పెంచుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు. ఏకంగా ఒక్క ఓటమి కూడా లేకుండా సూపర్ సక్సెస్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నారు. అలాంటి వారిలో నాగ్ అశ్విన్ కూడా ఒకరు. ఈయన ఇప్పటివరకు చేసింది కేవలం మూడే మూడు సినిమాలు. ఆ మూడు కూడా సూపర్ హిట్ అయ్యాయి. దర్శకుడిగా నాగ్ అశ్విన్ కు మాత్రమే కాదు అటు నటినటులకు కూడా మంచి పేరును తెచ్చిపెట్టాయి. ముందుగా వైవిద్యమైన దర్శకుడు శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన నాగ్ అశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాతో డైరెక్టర్ అవతారం ఎత్తాడు.


 నాని హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఇదే సినిమాలో ఒక కీలక పాత్రలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా నటించి ఆకట్టుకున్నాడు. ఎవరెస్టు పర్వతంపై షూటింగ్ జరుపుకున్న మొదటి తెలుగు సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. ఇక ఈ మూవీ 2015లో విడుదలై మంచి విజయాన్ని కూడా సాధించింది. ఈ సినిమా తర్వాత బాగా గ్యాప్ తీసుకుని నాగ్ అశ్విన్ మహానటి సావిత్రి బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏకంగా హీరోయిన్ కీర్తి సురేష్ ను నేటితరం ప్రేక్షకులకు సావిత్రిగా పరిచయం చేశాడు. ఇక ఈ మూవీ సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాగా రికార్డు సృష్టించింది.


 ఆ తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకుని నాగ్ అశ్విన్ ప్రభాస్ లాంటి పెద్ద హీరోతో కల్కి 2898 ఏడి అనే సినిమాను తీసాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా 1200 కోట్లకు పైగా వసూల్లు సాధించి ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అయితే ఇంత పెద్ద విజయాలు సాధించినప్పటికీ నాగ్ అశ్విన్ సాదా సీదా జీవన శైలి అభిమానులను ఫిదా చేస్తుంది. ఇలా తన వ్యక్తిత్వంతోనే కాదు తన సినిమాలతో కూడా ప్రేక్షకులను ఫిదా చేసేశాడు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో మొదటి వరుసలో కొనసాగుతున్నాడు నాగ్ అశ్విన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: