మోక్షజ్ఞ రియల్ బిహేవియర్ బయటపెట్టిన ప్రముఖ నటుడు.. బాలయ్యలా కాదంటూ?

Reddy P Rajasekhar
మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఈ ఏడాదే ఉండబోతుందని వైరల్ అయిన వార్తలు ఎట్టకేలకు నిజమయ్యాయి. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ తెరకెక్కనుందనే సంగతి తెలిసిందే. అయితే మోక్షజ్ఞను వ్యక్తిగతంగా కలిసిన ఇండస్ట్రీ ప్రముఖులు తక్కువ మందే ఉన్నారు. సత్యానంద్ గారి దగ్గర మోక్షజ్ఞ శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. సత్యానంద్ కొడుకు రాఘవ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్నారు.
 
అయితే రాఘవను సినిమాలలో చాలామంది చూసే ఉంటారు కానీ అతని పేరు మాత్రం పెద్దగా పాపులర్ కాలేదు. తాజాగా రాఘవ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. మోక్షజ్ఞ వెరీ డీసెంట్ అని లవ్లీ హ్యూమన్ బీయింగ్ అని ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎలా ఉండాలో మోక్షజ్ఞకు బాగా తెలుసని రాఘవ అన్నారు. మోక్షజ్ఞ చాలా కష్టపడతాడని యాక్టింగ్ విషయంలో మోక్షజ్ఞ వెరీ గుడ్ అని ఆయన తెలిపారు.
 
బాలయ్య ప్రస్తుతం చేస్తున్న పాత్రల్లాంటి రోల్స్ ను మోక్షజ్ఞ ఎంచుకోకపోవచ్చని ఫాదర్ లెగసీని మోక్షజ్ఞ కచ్చితంగా కంటిన్యూ చేసాడని పేర్కొన్నారు. కొత్తగా ఎవరైనా కలిసినా మోక్షజ్ఞ బాగా మాట్లాడతాడని పేర్కొన్నారు. మోక్షజ్ఞ చాలా ఓపెన్ గా మాట్లాడతాడని ఎక్కడా బౌండరీలు పెట్టుకోడని ఆయన తెలిపారు. రాఘవ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 
మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాకే 20 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది. తొలి సినిమాకే ఈ స్థాయిలో పారితోషికం అందుకోవడం సాధారణ విషయం కాదు. మోక్షజ్ఞ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. మోక్షజ్ఞ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగి భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఆశిద్దాం. లుక్స్ పరంగా ఇప్పటికే ప్రేక్షకులను మెప్పించిన నందమూరి మోక్షజ్ఞ యాక్టింగ్ విషయంలో సైతం మెప్పిస్తే కెరీర్ పరంగా తిరుగుండదని చెప్పడంలో సందేహం అవసరం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: