ఏకంగా ఆరు గంటలు రైల్వే స్టేషన్ లోనే వెయిట్ చేసిన ప్రభాస్.. ఎవరి కోసమో తెలుసా..?
మారుతి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాను ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసారు ప్రభాస్. రెండు పాటలు కొన్ని సీన్స్ షూట్ చేస్తే ప్రభాస్ వర్షెన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అంతేకాదు త్వరలోనే సలార్ 2 కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు ప్రభాస్ . ఇదే క్రమంలో ఆయన ఎంతో ఇష్టంగా కమిట్ అయినా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఫౌజి" సినిమా కోసం ప్రభాస్ చాలా చాలా కష్టపడుతున్నాడు . అంతేకాదు ఈ సినిమా కోసం బిగ్ రిస్క్ కూడా చేస్తున్నాడు ప్రభాస్ .
ఈ సినిమాలో చాలా ఎమోషనల్ పాత్రులో కనిపించబోతున్నారట . వర్షం సినిమా నాటి ప్రభాస్ ని మనం మళ్లీ తెర పై చూడబోతున్నాం అంటున్నారు ఫ్రెండ్స్ . అయితే ప్రభాస్ ఈ సినిమా కోసం హైదరాబాద్లో వేసిన భారీ సెట్ లో పాల్గొంటున్నాడు అంటూ తెలుస్తుంది. హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సినిమాకి సంబంధించి కోట్లు ఖర్చు చేసి ఒక భారీ సెట్ వేసారట . అది కూడా రైల్వే స్టేషన్ సెట్. ఫౌజీ సినిమాలో 60 శాతం సీన్స్ అన్నీ కూడా రైల్వే స్టేషన్ కి సంబంధించి ఉంటాయట.
ఇది చాలా రియలిస్టీక్ గా చాలా ఆహ్లాదకరంగా ఉండే సినిమా అని నిజమైన ప్రేమకు నిదర్శనం ఇదే అనే విధంగా హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట . అయితే ఈ సినిమా షూట్స్ లో భాగంగా వేసిన సెట్స్ లో చాలా చాలా సేపు టైం స్పెండ్ చేయాల్సి వస్తుందట ప్రభాస్ . అంతే కాదు ఏకంగా ఆరు గంటలు ఏడు గంటలు ప్రభాస్ ఈ రైల్వే స్టేషన్ సెట్ లోనే ఉంటూ సీన్స్ చేస్తున్నాడట . పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ సంపాదించుకున్న హీరో ప్రతి చిన్న సీన్ కోసం ఇంతలా కష్టపడుతూ ఉండడం ఆయన నిజాయితీ తనానికి నిదర్శనం అంటున్నారు ఫ్యాన్స్. ఖచ్చితంగా ఈ సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!