16 ఏళ్ల‌కే హీరోయిన్‌... 21 ఏళ్ల‌కే త‌ల్లి... ఇప్ప‌ట‌కీ వ‌న్నె త‌ర‌గ‌ని అందం..ఎవ‌రా హీరోయిన్‌..!

RAMAKRISHNA S.S.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె ఒకప్పుడు క్రేజీ హీరోయిన్. కేవలం 16 ఏళ్ళ వయసులో సీనీ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె.. వెండితెరపై తన అందచందాలతో మాయ చేసింది. స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు నటించి మెప్పించింది. ఇప్పుడు ఆ హీరోయిన్ వయసు 50 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తగ్గని అందం ఫిట్‌నెస్‌తో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు రవినా టాండన్. ప్రస్తుతం ఆమె వయసు 50 సంవత్సరాలు.

1974 అక్టోబర్ 26న ఆమె జన్మించింది. 1991లో సల్మాన్ ఖాన్ హీరోగా పత్త‌ర్ కి పూల్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో నటిగా ప్రశంసలు అందుకున్న రవీనా.. తర్వాత గోవిందా, అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి లాంటి హీరోలతో కలిసి సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించింది. రవీనా 2004లో ప్రముఖ బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీ ని వివాహం చేసుకుంది. ఉపేంద్ర సినిమా ద్వారా కన్నడ సినిమాలకి అడుగుపెట్టిన రవినా.. ఆ తర్వాత దక్షిణాదిలో పలు సినిమాలలో నటించింది.

తెలుగులో బాలయ్య స‌ర‌సన బంగారు బుల్లోడు, నాగార్జునకి జోడిగా ఆకాశ వీధిలో సినిమాలు చేసింది. చాలాకాలం తర్వాత ఆమె భారీ పాన్ ఇండియా సినిమా కేజీఎఫ్ 2 లో కీలక పాత్ర పోషించింది. ఇందులో రమ్మికా న్ అనే పాత్రలో ఆమె నటించింది. 16 ఏళ్ళ వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రవీనా.. 20 ఏళ్ల వయసులో ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకుంది. పిల్లలను దత్తత తీసుకునే సమయానికి ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు. ఇక రవీనా టండ‌న్‌.. అజయ్ దేవగణ్‌ ముంబై కాలేజీలో కలిసి చదువుకున్నారు. కెరీర్ ఫామ్‌లో ఉన్నప్పుడే అక్షయ్ కుమార్, రవీనా ప్రేమలో పడ్డారు. వీరిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది. అనుహ్యంగా ఇద్దరు విడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: