క‌ల్కి-2 ఒక్కటే..మూడు బడా సినిమాల‌కు స‌మానం?

Veldandi Saikiran

ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన కల్కి సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. భవిష్యత్తును, పురాణాలను ప్రపంచాన్ని కలగలిపి నాగ్ అశ్విన్ సృష్టించిన కొత్త ప్రపంచం ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా దానికి తగినట్టుగానే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 1,000కోట్ల మార్కును క్రాస్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోనూ తెగ సందడి చేస్తోంది.

ఇదిలా ఉండగా.... ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిజానికి కల్కి సినిమా కథ మొత్తం పార్ట్-2లోనే ఉందట. ఈ విషయం తెలిసిన అనంతరం కల్కి 2 సినిమాపై భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. మొదటి పార్ట్ లో అమితాబ్ బచ్చన్ పాత్ర ఎక్కువగా ఉంది. ఇక రెండవ భాగంలో ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది.

ప్రతి నాయకుడు పాత్ర పోషించినటువంటి కమల్ హాసన్ విశ్వరూపంలో ఎలా ఉండబోతుంది. ఇలా ఈ సినిమాపై అనేక రకాల ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కల్కి రెండవ భాగాన్ని ఉద్దేశిస్తూ నాగ్ అశ్విన్ కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. పార్ట్ 2 ఒక్కటే... రెండు, మూడు సినిమాలకు సమానంగా ఉంటుందని వెల్లడించారు. అంటే రెండవ భాగాన్ని ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు అనేది మనకు ఈ విషయంతోనే అర్థమవుతుంది.

ఇక సినిమా నిడివి కూడా మూడు గంటలకు పైనే ఉంటుందా అన్న సందేహాలు చాలానే వస్తున్నాయి. అలాగే కథలో కొత్త పాత్రలు చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీనికోసం నాగ్ అశ్విన్ కూడా కాస్త ఎక్కువ సమయాన్నే తీసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమాను కూడా నాగ్ అశ్విన్ భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారని అర్థమైంది. ఈ విషయం తెలిసి ప్రభాస్ అభిమానులు ఎంతో సంబరపడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: