ఆ స్టార్ హీరోతో కలిసి చిరంజీవికి , రామ్ చరణ్ కు గట్టి షాక్ ఇచ్చాడు గా ?

Amruth kumar
మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి నట వారసుడుగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన రామ్ చరణ్ తండ్రికి త‌గ్గ‌ తనయుడిగా అనిపించుకున్నాడు .. తన నటనలో డాన్సులో చిరంజీవిని మరిపించాడు .. చిరుత సినిమాతో వెండితెరకి పరిచయమైన రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోస్ లో ఒకరిగా ఉన్నాడు. రెండో సినిమా మగధీరతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టి రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ తన నట విశ్వరూపం చూపించడు. త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. అలాగే రామ్ చరణ్ సక్సెస్ లో చిరంజీవి పాత్ర కూడా ఎంతో ఉంది. చిరంజీవిని ఓ విషయంలో రామ్ చరణ్ ను మోసం చేశాడట.

రెండు నెలల తర్వాత చరణ్ చేసిన మోసం చిరంజీవికి తెలిసిందట.. గతంలో ఓ ఇంటర్వ్యూలో రానా, సాయి పల్లవి , చిరంజీవి పాల్గొన్నారు.. అయితే ఆ కార్యక్రమంలో రానా మాట్లాడుతూ.. నేను 10th క్లాస్ చదివే సమయంలో చిరంజీవి అంకుల్ ఇంటికి ఎక్కువ వెళ్లేవాడని.. ఓ రోజు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నక్షత్రాలు చూడడానికి ఓ టెలిస్కోప్ ని ఏర్పాటు చేశారు .. నేను ఆ టెలిస్కోప్ నుంచి చూస్తున్నాను అయితే వెనుక నుంచి ఎవరో తన తలపై కొట్టారు తిరిగి చూస్తే చిరంజీవి అంకుల్.. ఓరే ముందు దానికి ఉన్న మూత తీరా అని అన్నారు.. ఇక అది నా జీవితంలో మోస్ట్ ఫన్నీ మూమెంట్ అని రానా అన్నాడు.

ఆయన చెప్పిన మాటలకు కొనసాగింపగా చిరంజీవి నేను టెలిస్కోప్ మూత తీయమంటే రానా మా ఇంటికి కిటికీలకు ఉన్న గ్రిల్ తీసేసాడు. రామ్ చరణ్ రానా ఇద్దరూ రూమ్లో చదువుకుంటున్నారని నేను అనుకునేవాడిని.. వీరిద్దరూ ఇంటికి ఉన్న గ్రిల్ తీసేసి రాత్రంతా తిరిగి ఆ కిటికీ నుంచి రూంలోకి వెళ్లేవారు.. ఈ విషయం తెలుసుకోవడానికి నాకు రెండు నెలల సమయం పట్టిందని ఆయన అన్నాడు. అలా చిరంజీవి మటలకు ఆ ఇంటర్వ్యూలో ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇలా చిన్నతనంలోనే రామ్ చరణ్ చిరంజీవిని మోసం చేశాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: