శివ నిర్వాణ : ప్రేమ కథలతో బ్లాక్ బస్టర్స్.. ఇప్పుడేమో వరుస ఫ్లాప్స్ తో విలవిల..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో శివ నిర్వాణ ఒకరు. ఈయన నాచురల్ స్టార్ నాని హీరోగా నివేదా థామస్ హీరోయిన్గా రూపొందిన నిన్ను కోరి అనే సినిమాతో దర్శకుడిగా కెరీర్ను ప్రారంభించాడు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమాను తెరకెక్కించిన విధానానికి గాను శివ నిర్వాణకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇలా మొదటి మూవీతోనే ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ప్రశంసలను అందుకున్న ఈ దర్శకుడు తన కెరియర్లో రెండవ సినిమాగా నాగ చైతన్య హీరోగా సమంత హీరోయిన్గా మజిలీ అనే మరో ప్రేమ కథ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.

ఈ సినిమా కూడా అద్భుతంగా ఉండడంతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాను రూపొందించిన విధానానికి కూడా ఈయనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి. ఇక ప్రేమ కథ చిత్రాలను అద్భుతంగా వెండి తెరపై తెరకెక్కించడంలో ఈయన స్పెషలిస్ట్ అనే పేరును కూడా తక్కువ కాలంలోనే సంపాదించుకున్నాడు. అంతా గొప్ప పేరును తక్కువ టైమ్ లోనే సంపాదించుకున్న ఈయన ఈ మధ్యకాలంలో మాత్రం వరుస అపజాగాలను అందుకుంటున్నాడు. కొంత కాలం క్రితం నాని హీరోగా ఈయన టక్ జగదీష్ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ థియేటర్లలో కాకుండా ఓ టీ టీ లో విడుదల అయింది. కానీ ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పెద్దగా ఆదరణ దక్కలేదు.

ఇక కొంత కాలం క్రితం ఈ దర్శకుడు విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్గా ఖుషి అనే మూవీని రూపొందించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఖుషి మూవీ విడుదల ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈయన తదుపరి మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ మాత్రం ఇప్పటివరకు రాలేదు. ఇలా మొదటి రెండు మూవీలలో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న ఈ దర్శకుడు తర్వాత మాత్రం రెండు అపజయాలను అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: