ఆ విషయంలో యూటర్న్ తీసుకున్న మహేశ్ భార్య నమ్రత .. సితార చేత అలాంటి పని చేయించబోతుందా..?

Thota Jaya Madhuri
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పబ్లిసిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ప్రెసెంట్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రాబోతుంది. డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమాను అఫీషియల్ గా పూజా కార్యక్రమాలు ప్రారంభించి సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు జక్కన్న . ఇలాంటి క్రమంలోనే  మహేష్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి.


మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో మనకు తెలుసు . సితారకు సంబంధించిన పలు వార్తలు ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అయ్యాయి. చాలా చిన్న ఏజ్ లోనే భారీ యాడ్ లో నటించి భారీ రెమ్యూనరేషన్ ని కూడా తీసుకుంది . ఆ రెమ్యూనరేషన్ ని మొత్తం అనాధ పిల్లలకే పంచేసింది. అయితే ఇప్పుడు సితార సినీ ఇండస్ట్రీ ఎంట్రీ పై స్పెషల్ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. నిజానికి సితార ని ఇండస్ట్రీలోకి హీరోయిన్గా దింపాలి అనే ఆలోచన నమ్రత శిరోద్కర్ దే.


అయితే ఇప్పుడు ఆ విషయం నుంచి యుటర్న్ తీసుకుంది నమ్రత అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఇంత చిన్న ఏజ్ లోనే హీరోయిన్ గా అడుగుపెడితే తను ఎలాంటి రోల్స్ అయినా చేయాలి..? అలాంటి సీన్స్ లో అయినా నటించాలి..? అది ఘట్టమనేని ఫ్యాన్స్ కి నచ్చకపోవచ్చు . అందుకే ఫస్ట్ కొన్ని సినిమాలలో  హీరోయిన్స్ చిన్నప్పటి క్యారెక్టర్స్ లో.. అదే విధంగా ఏదైనా పలు ఇంపార్టెంట్ సీన్స్ కి సంబంధించిన క్యారెక్టర్స్ లో నటింపజేసి.. ఆ తర్వాత సితారను హీరోయిన్గా ఒక బిగ్  డైరెక్టర్ తో ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటుందట . నమ్రత  కూడా ఆలోచన మంచిదే . మెగా డాటర్ నిహారిక ఇండస్ట్రిలో స్టార్ హీరోయిన్ అయిపోదామని అడుగుపెట్టి ఎలా బోల్తా కొట్టిందో చూసాం. నమ్రత  ప్లాన్ వర్కౌట్ అయితే మాత్రం సితార లైఫ్ ఫుల్ సెటిల్ అయిపోయినట్లే అంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: