సలార్ 2.. రెబల్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్..!

shami
రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి సలార్ ఇచ్చిన హై అంతా ఇంతా కాదు. సలార్ 1 సీజ్ ఫైర్ లో ప్రశాంత్ నీల్ ప్రభాస్ మాస్ స్టామినాని పర్ఫెక్ట్ గా వాడుకున్నాడని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. సలార్ 1 చివర్లో సలార్ 2 శౌర్యాంగ పర్వం అంటూ భారీ ట్విస్ట్ ఇచ్చాడు. ఐతే సలార్ 1 లాస్ట్ డిసెంబర్ లో వచ్చింది. సలార్ 2 ఎప్పుడు అన్నది అసలు ప్రస్తావన తేవట్లేదు. ఓ పక్క ప్రభాస్ తన క్యూ లైన్ లో ఉన్న సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం మరుతితో రాజా సాబ్ ఆ తర్వాత సందీప్ వంగాతో స్పిరిట్ ఉంది.
ప్రశాంత్ నీల్ కూడా వచ్చే నెల నుంచి ఎన్ టీ ఆర్ సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. తారక్ తో సినిమా పూర్తి చేసే వరకు ప్రభాస్ సినిమా మొదలు పెట్టే ఛాస్ లేదు. సో ఎలా చూసినా సలార్ 2 మరో రెండేళ్లు టైం పట్టేలా ఉంది. మరోపక్క చిత్ర యూనిట్ నుంచి వినిపిస్తున్న టాక్ ఏంటంటే సలార్ 2 ని ఆపేస్తారన్నట్టుగా ఉంది. ప్రభాస్ ప్రశాంత్ నీల్ సలార్ 2 ని లైట్ తీసుకున్నారని గట్టి టాక్ ఉంది.
అదే జరిగితే మాత్రం రెబల్ స్టార్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సలార్ 1లో దేవ పాత్రని చాలా సీరియస్ గా రాసుకున్న ప్రశాంత్ నీల్.. దేవ వర్సెస్ వరద రాజ మన్నార్ కథను ఎలా తీర్చిదిద్దుతాడా అని ఫ్యాన్స్ అంతా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం సలార్ 2 ని కాకుండా ఎన్ టె ఆర్ తో సినిమా ఆ తర్వాత కె.జి.ఎఫ్ 3 ప్లానింగ్ లో ఉన్నాడట. ఆయన ప్లానింగ్ ఎలా ఉన్నా సలార్ 2 కోసం దేవ ఫ్యాన్స్ మాత్రం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మరి వాళ్లకి అటు ప్రశాంత్ నీల్ ఇటు రెబల్ స్టార్ ఏమని సమాధానం చెబుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: