రూట్ మార్చిన కళ్యాణ్ రామ్ .. షాకింగ్ డిసిషన్‌కు కారణం ఇదే..!

Amruth kumar
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం వరస సినిమా లు చేస్తూ బిజీ గా ఉన్నాడు . డెవిల్ హిట్ తర్వాత ఆయన తన 21 వ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు . ఫుల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమా తో ప్రదీప్ చిలుకూరి దర్శకుడు గా పరిచయం కాబోతున్నాడు . అశోక్ క్రియేషన్స్ బ్యానర్ పై అశోక్ వర్ధన్ ముప్పా , సునీల్ బలుసు , ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ సినిమా ని ఎంతో గ్రాండ్గా నిర్మిస్తున్నాయి . అలాగే తన 21వ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది .

అయితే ఇప్పుడు ప్రస్తుతం కళ్యాణ్ రామ్ వైజాగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది . NKR21 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా కి సంబంధించి న లేటెస్ట్ షెడ్యూల్ వైజాగ్ లో మొదలు పెట్టారు . సినిమా యూనిట్ ఈ విషయాన్ని తెలియజేస్తూ షూటింగ్ కు సంబంధించిన ఓ పిక్ ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు . సినిమా షూటింగ్ కోసం కళ్యాణ్ రామ్ మూవీ టీం వైజాగ్ తరలి వచ్చింది .. వైజాగ్ లో ఒక ముఖ్యమైన షెడ్యూల్ కోసం షూటింగ్ ను మొదలు పెట్టారు టీం .. అందులో ప్రధాన తారాగణం అంతా పాల్గొంటుంది . 15 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో టీం కీలక స‌న్నివేశాలను తెర‌కెక్కించనుంది అన్నీ అంటున్నారు .

ఇక సినిమా విషయానికొస్తే .. సోహైల్ ఖాన్ మరో కీలకపాత్ర లో న‌టిస్తున్న‌డు . రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు . అజనీష్ లోక్ నాథ్ బాణీలు కడుతున్నారు . శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్‌ క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్లపై అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు నిర్మిస్తున్నారు. మరి కళ్యాణ్ రామ్ కొత్త మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో  చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: