కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకోవడానికి చాలా సమయం పట్టేది. నేరుగా దర్శకుడిగా అవకాశాలు చాలా తక్కువ మంది కి వచ్చేవి. దానితో కొంత కాలం పాటు కథ రచయితగా , ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి అనుభవాన్ని సంపాదించుకొని ఆ తర్వాత దర్శకులుగా కెరియర్ మొదలు పెట్టేవారు. ఇదంతా జరిగే ప్రాసెస్ లో వారి వయస్సు కూడా పెరిగేది. ఇక ఈ మధ్య కాలంలో మాత్రం షార్ట్ ఫిలిమ్స్ ద్వారా , వెబ్ సిరీస్ ల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని చాలా చిన్న వయసు లోనే సినిమాకు దర్శకత్వం చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది. ఇకపోతే కొంత కాలం క్రితం శివాజీ ప్రధాన పాత్రలో 90's ఏం మిడిల్ క్లాస్ బయోపిక్ అనే ఓ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ వెబ్ సిరీస్ కి ప్రేక్షక ఆదరణ అద్భుతమైన స్థాయిలో దక్కింది. ఈ వెబ్ సిరీస్ కు ఆదిత్య హాసన్ అనే యువ దర్శకుడు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ తర్వాత ఈయనకు అవకాశాలు వెల్లువెత్తుతున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ తర్వాత ఈ దర్శకుడు ఇప్పటికే నితిన్ హీరోగా ఓ సినిమాకు కమిట్ అయి ఉన్నాడు. ఇక నితిన్ హీరోగా ఓ సినిమాకు కమిటీ ఉన్న ఈ దర్శకుడు మరో హీరోని కూడా లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ తమ్ముడు అయినటువంటి ఆనంద్ దేవరకొండ హీరోగా ఓ మూవీ ని రూపొందించడానికి ఆదిత్య హాసన్ రెడీ అయినట్లు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొంత కాలంలోనే రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా ఒక్క వెబ్ సిరీస్ తో మంచి సక్సెస్ను అందుకొని టాలీవుడ్ యంగ్ హీరోలను వరుసగా ఈ దర్శకుడు లైన్ లో పెడుతున్నట్టు తెలుస్తుంది.