టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటివరకు అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమా ఏకంగా 500 కోట్ల కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లు ఈ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఈ పోస్టర్ను కూడా విడుదల చేసింది. ఇప్పటికి కూడా ఈ సినిమా సూపర్ సాలిడ్ హోల్డ్ ను కనబరిస్తూ మంచి కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబడుతుంది. ఇప్పటికే ఈ సినిమా చాలా ప్రాంతాల్లో కొత్త కొత్త రికార్డులను సృష్టించింది.
ఇలా తమ అభిమాన హీరో సినిమా అదిరిపోయే రేంజ్ రికార్డులను సృష్టించడంతో ఎన్టీఆర్ అభిమానులు ప్రస్తుతం ఫుల్ ఖుషి గా ఉన్నారు. కానీ వారి ఆనందం ఎంతో కాలం నిలబడేలా కనబడడం లేదు. ఎందుకు అంటే కొంత కాలం క్రితం అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 1 సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దానితో పుష్ప పార్ట్ 2 ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. పుష్ప పార్ట్ 2 మూవీ ని డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
ఈ మూవీకి అన్ని రకాలగా కలిపి 1000 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి పాజిటివ్ టాక్ వచ్చినట్లు అయితే పుష్ప పార్ట్ 2 మూవీ , దేవర పార్ట్ 1 మూవీ నెలకొల్పిన అనేక రికార్డులను తుడిచి పెట్టే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. అదే కానీ జరిగితే ఎన్టీఆర్ అభిమానులకు నిరుత్సాహం మిగిలే అవకాశం కూడా ఉంది అని కొంత మంది జనాలు అభిప్రాయ పడుతున్నారు.