తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ను సంపాదించుకున్న హీరోలలో నాచురల్ స్టార్
నాని ఒకరు . ఈయన ఎవరి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ
పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చి ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ ప్రస్తుతం తెలుగు సినీ
పరిశ్రమ లో తనకంటూ ఒక మంచి స్థాయిని ఏర్పరచుకున్నాడు . ఈ మధ్య కాలంలో
నాని నటించిన ప్రతి
సినిమా కూడా మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే
నాని ఆఖరుగా సరిపోతా శనివారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ సినిమాలో
ప్రియాంక అరుల్
మోహన్ హీరోయిన్ గా నటించగా ... ఈ సినిమాకు
వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. ఈ
మూవీ తెలుగు ,
తమిళ్ ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషలలో విడుదల అయ్యి మంచి కలెక్షన్లను
బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ మధ్య కాలంలో ఈయన నటించిన సినిమాలు వరుస విజయాలను అందుకోవడం దాదాపుగా 60 కోట్ల నుండి 80 100 కోట్ల వరకు కాలక్షనను రాబడుతూ ఉండడంతో ఆయన తన రెమ్యూనిరేషన్ ను పెంచినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.
ఇకపోతే ప్రస్తుతం
నాని ఒక్కో
మూవీ కి 35 కోట్ల వరకు పారితోషకాన్ని తీసుకుంటున్నట్లు ఆ వార్త వైరల్ అవుతుంది. చాలా మంది
నాని హీరో గా రూపొందిన సినిమాలకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా 50 నుండి 60 కోట్ల కలెక్షన్ లు ఈజీగా వస్తాయి. అదే
బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేస్తే 200 కోట్ల కలెక్షన్లు వచ్చిన పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. అలాంటి స్థాయి ఉన్న హీరోకు 35 కోట్ల రెమ్యూనిరేషన్ పెద్ద విషయం ఏమి కాదు అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.