డార్లింగ్ హీరో ప్రభాస్ బర్త డే..కళ్లు జిగేళ్లుమనే గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్..మోస్ట్ మోస్ట్ స్పెషల్..!
కాగా డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పలు హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్ . అంతేకాకుండా స్టార్స్ కూడా ప్రభాస్ కి స్పెషల్ బర్త్డ డే విషెస్ ట్వీట్టర్ ద్వార చేస్తున్నారు . ఇప్పటికే చాలామంది స్టార్స్ సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ కి బర్త్డ డే విషెస్ అందజేశారు. కాగా ఎన్టీఆర్ మాత్రం ప్రభాస్ కోసం చాలా స్పెషల్ గిఫ్ట్ ని ఏకంగా తన ఇంటికే పార్సల్ చేశారట .
ఆ గిఫ్ట్ చూసి ప్రభాస్ చాలా చాలా స్పెషల్గా హ్యాపీగా ఫీలయ్యారట. మొదటి నుంచి ఎన్టీఆర్ - ప్రభాస్ మధ్య ఉండే బాండింగ్ వేరే లెవెల్ . ఫ్రెండ్షిప్ అని చెప్పలేం అంతకుమించిన రేంజ్ లోనే ఇద్దరు చాలా చాలా క్లోజ్ గా ఉంటారు . బ్రదర్స్ లా ఉంటారు అని చెప్పుకోక తప్పదు . కాగా ప్రభాస్ బర్త్డ డే సందర్భంగా ఎన్టీఆర్ ఆయనకు ఎంతో ఇష్టమైన కాస్ట్లీ వాచ్ ను గిఫ్ట్ గా ఇంటికి పంపించారట . అది చూసిన ప్రభాస్ సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యి ఎన్టీఆర్ కి "థాంక్యూ డార్లింగ్" అంటూ స్పెషల్ గా కాల్ చేసి మరి థాంక్స్ చెప్పారట.
ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఫ్రెండ్షిప్ అంటే భుజాలపై చేతులు వేసుకోవడమే కాదు ఇలా తెలియకుండా చిన్న చిన్న సర్ప్రైజెస్ కూడా ఇచ్చుకోవాలి . ఎంత స్టార్ సెలబ్రిటీస్ అయినా ఆ ఫ్రెండ్షిప్ లో ఉండే మజానే వేరు అంటూ ఓ రేంజ్ లో ప్రభాస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ వార్తను ట్రెండ్ చేస్తున్నారు. రీసెంట్ గానే దేవర సినిమాతో అభిమానులను పలకరించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ వార్ 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ప్రభాస్ పలు పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ తనదైన స్టైల్ లో ముందుకు దూసుకుపోతున్నాడు..!!