ఖలేజా ఫ్లాప్..మహేష్ బాబు చేసిన పనిని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్న నిర్మాత..?

Pandrala Sravanthi
- భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయిన ఖలేజా..
- సినిమాల్లోనే కాదు బయట కూడా మహేష్ శ్రీమంతుడే..
- ప్రేక్షకుల నెగటివ్ టాక్ తో ఖలేజా ఫ్లాప్..

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈయన అందానికి నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.ముఖ్యంగా ఎంతోమంది అమ్మాయిలకి మహేష్ బాబు కలల రాకుమారుడు..సినిమాలో ఉన్న హీరోయిన్స్ కూడా మహేష్ అందానికి పడి చచ్చిపోతారు.. మహేష్ అనే పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది అంటూ పదేపదే ఆయన పేరును తలుచుకుంటూ ఉంటారు.అయితే అలాంటి మహేష్ బాబు కేవలం సినిమాల్లోనే కాదు బయట దానధర్మాలు చేయడంలోను శ్రీమంతుడిలాగే ఉంటారు. మరి తన సినిమా ఫ్లాప్ అయిన సమయంలో మహేష్ బాబు చేసిన పని ఏంటో ఇప్పుడు చూద్దాం..
 నిర్మాతని ఆదుకున్న మహేష్:
ఘట్టమనేని మహేష్ బాబు కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చారు.మహేష్ బాబు ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు నటించారు.అయితే ఒక మూవీ మాత్రం భారీ అంచనాల మధ్య వచ్చి పెద్ద డిజాస్టర్ అయింది.కానీ ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో మాత్రం ఇప్పటికీ సినీ జర్నలిస్టులకు సైతం అర్థమవ్వడం లేదు. ఇక ఆ సినిమా ఏదో కాదు ఖలేజా.. భారీ అంచనాల మధ్య వచ్చిన ఖలేజా మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు.. మనుషుల్లోనే దేవుడు ఉంటాడు అనే ఒక అద్భుతమైన ఐడియాతో త్రివిక్రమ్ ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే ఎంతో అద్భుతంగా ఉండే ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఈ సినిమాలో మహేష్ బాబు,అలీ,అనుష్కల మధ్య వచ్చే కామెడీ సీన్స్ అయితే చాలామందికి ఇష్టం. ఇక ఈ సినిమా థియేటర్లలో చూడడానికి ఎవరు ఇష్టపడకపోయినప్పటికీ ఇప్పటికీ ఈ సినిమాల్ని ఇంటర్నెట్లో గాని టీవీలలో వచ్చిన గానీ మిస్ అవ్వకుండా చాలామంది చూస్తారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ అవ్వడానికి మెయిన్ థింగ్  సినిమా చూసిన ఆడియన్స్ అని చెప్పవచ్చు. 

అయితే ఒక సినిమా ఎలా ఉందో ఆడియన్స్ ఇచ్చే రివ్యూలని బట్టి మిగతావారు సినిమాలకు వెళ్తారు  అయితే ఈ సినిమాను చూసిన కొంత మంది నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడంతో చాలామంది సినిమా బాలేనప్పుడు థియేటర్లకు వెళ్లి ఏం లాభం అని వెళ్లలేదు.దాంతో ఈ మూవీ పెద్ద డిజాస్టర్ అయింది. అయితే ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది.అదేంటంటే అద్భుతం జరిగినప్పుడు ఎవరు గుర్తించరు జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు అని.. అయితే ఈ డైలాగ్ ఈ సినిమాకి బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే సినిమా థియేటర్లలో ఉన్నప్పుడు ఎవరు గుర్తించలేదు.కానీ టెలివిజన్లోకి వచ్చాక అందరూ గుర్తించేశారు.అయితే ఈ సినిమా ప్లాప్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా ఇప్పటికీ ఒక అద్భుతమే.. ఒకవేళ ఈ సినిమాని కనుక ఇప్పుడు రీ రీలీజ్ చేస్తే కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయం అంటారు చాలామంది సినీ విశ్లేషకులు. అయితే ఈ సినిమాకి ప్రొడ్యూసర్లుగా సి కళ్యాణ్, సింగనమల రమేష్ బాబు, ఎస్.సత్య రామ్మూర్తి లు సంయుక్తంగా నిర్మించారు. అయితే ఈ సినిమా ప్లాఫ్ అవ్వడంతో మహేష్ బాబు తన రెమ్యూనరేషన్ ని చాలా వరకు తిరిగి ఇచ్చేసారట. అయితే ఈ విషయం తెలిసిన చాలా మంది మహేష్ బాబు సినిమాల్లో శ్రీమంతుడు పాత్రను పోషించడమే కాదు రియల్ లైఫ్ లోను శ్రీమంతుడే అంటూ మాట్లాడుకున్నారు. ఇక మహేష్ బాబు చేసిన పనికి నిర్మాతలు కూడా షాక్ అయ్యారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: